
బెంగళూరు: ఓ యువతిని కారులో తీసుకెళ్లి అనంతరం హోటల్ రూమ్‌లో ఆమెపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం చామ్ రాజ్‌నగర్ జిల్లాలోని టి నర్సిపూర ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... వెస్ట్‌బెంగాల్‌కు చెందిన ఓ యువతిని కారులో రిహాన్, కిరణ్, కిషోర్ అనే వ్యక్తులు హోటల్‌కు తీసుకెళ్లారు. అనంతరం సదరు యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారం చేసిన అనంతరం డబ్బులు ఇవ్వాలని యువతిని బెదిరించారు. ముగ్గురు బెదిరింపులకు భయపడిన యువతి డబ్బులు ఇస్తానని చెప్పి ఇంటికి వచ్చిన తరువాత స్థానికులకు జరిగిన విషయం చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని వివరించారు. యువతి ఫోన్‌లో తమతో ఉన్నప్పుడు అశ్లీల ఫోటోలు ఉండడంతో వాటిని తొలగించామని నిందితులు ఆరోపణలు చేశారు. అనంతరం ఆమె నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం.











