
5321 articles

మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఎంపి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు రాష్ట్రవ్యా ప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసును సమగ్రంగా విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తూ డిజిపి సివి ఆనంద్ కీలక ఆదేశాలు జారీ చేశారు. సి ఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కేసు సున్నితమైనది కావడంతో దర్యాప్తును మ హిళా ఐపిఎస్ అధికారిణి పర్యవేక్షణలో కొనసాగించాలని డిజిపి నిర్ణయించారు. కూకట్‌ప ల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక బృం దం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. బాధితురా లు బాలిక కావడం, ఈ కేసులో ఉన్న ఆరోప ణల తీవ్రత దృష్ట్యా విచారణలో ఎలాంటి లో పాలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సిట్ బృందం ఇప్పటికే కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిని ప్రారంభించింది. పోలీసులు బాలిక స్టేట్మెంట్ ను చట్టపరమైన నిబంధనల ప్రకారం రికార్డ్ చే శారు. ఈ ప్రకటన ఆధారంగా మరిన్ని అంశాలను వెలికి తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. విచారణలో భాగంగా సిసిటివి ఫుటేజీలు, కాల్ డేటా, డి

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏ డాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చే పట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన నేపథ్యంలో జూనియర్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కు ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాల షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 12 నుంచి తొలివిడత అ డ్మిషన్లు చేపట్టాలని తెలిపింది. విద్యార్థులు ఈనెల 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్ - ఎయిడెడ్, కో -ఆపరేటివ్, టిజి రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, మైనారిటీ, కెజిబివి, టిజి మోడల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభించాలని వెల్లడించింది. జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతలు ప్రారంభించాలని బోర్డు ఆదేశించింది. జూన్ 30లోగా మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపింది. టెన్త్ ఇంటర్నెట్ మార్కుల మెమో ఆధారంగా ప్రిన్సిపాళ్లు ప్రవేశాలు చేపట్టాలని, అయితే విద్యార్థులు పదో తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్‌లు సమర్పించిన తర్వాత అడ్మిషన్లు ఖరారు చేయాలని తెలిపింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలలో ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీక
ప్రధాని ప్రసంగంపై మంత్రి పొన్నం విమర్శనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌మంచి పరిపాలన అందించటమంటే ప్రజలపై భారాలు మోపడమేనా? అని ప్రధాని మోడీ ప్రసంగంపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన గాంధీ భవన్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధానొస్తే ఎంతో లాభం జరుగుతుందని ప్రజలంతా భావించారని తెలిపారు. ఎయిర్‌పోర్ట్ కు పోయిగౌరవ ప్రదంగా స్వాగతం పలికామని గుర్తు చేశారు. అభివద్ధి కార్యక్రమాల్లో సీఎం కూడా పాల్గొన్నారని తెలిపారు. కానీ..పీఎం మాత్రం […] The post మంచి పరిపాలన అంటే ప్రజలపై భారాలు మోపడమా? appeared first on Navatelangana.
– డిసెంబర్ 9 నుంచి అందుబాటులోకివచ్చేలా చర్యలు: మంత్రి తుమ్మలనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌కొహెడ సమగ్ర మార్కెట్ నిర్మాణ పనులు తుది దశలోకి చేరుకున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు కొహెడ సమగ్ర మార్కెట్‌కు సంబంధించిన సవరించిన లేఅవుట్‌పై మార్కెటింగ్ అధికారులతో సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. […] The post తుది దశకు కొహెడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ appeared first on Navatelangana.
– చిలకలగూడ హత్య కేసును ఛేదించిన పోలీసులు– ప్రెస్‌మీట్‌లో వివరాలు వెల్లడించిన డీసీపీ రక్షిత కృష్ణమూర్తినవతెలంగాణ- అంబర్‌పేట/ఉస్మానియా యూనివర్సిటీప్రేమ వ్యవహారం నేపథ్యంలో హైదరాబాద్ చిలకలగూడలో బీటెక్ విద్యార్థిపై పక్కా ప్రణాళికతో కత్తులతో దాడి చేసి హత్య చేసిన ఘటనలో మైనర్ సహా 10 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలు వెల్లడించారు.చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిబావి, ఇందిరానగర్ కాలనీలో […] The post యవన్ హత్య కేసులో 10 మంది అరెస్ట్ appeared first on Navatelangana.
– లేకుంటే ఈ నెల 25న ధర్నాలు చేస్తాం– మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, టీవీవీపీ కమిషనర్‌కు సీఐటీయూ వినతినవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలనీ, ఔట్‌సోర్సింగ్ రద్దు చేసి ఈఎస్‌ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న ధర్నాలు చేయనున్నట్టు తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లారయూస్ యూనియన్ ప్రకటించింది. దానికి సంబంధించిన ధర్నా నోటీస్‌ను సోమవారం హైదరాబాద్‌లో తెలంగాణ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌కు, టీవీవీపీ కమిషనర్‌కు తెలంగాణ […] The post ప్రభుత్వాస్పత్రుల్లోని కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి appeared first on Navatelangana.
కేవీపీఎస్ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగ విరుద్దమని ప్రముఖ సీనియర్ అంబేద్కర్ వాదులు డాక్టర్ జె బి రాజు, డాక్టర్ పికట్ల భరత్ భూషణ్ లు అభిప్రాయపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు అధ్యక్షతన ‘దళిత క్రైస్తవుల పట్ల సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగబద్ధమేనా’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా […] The post దళిత క్రైస్తవుల ఎస్సీ హోదా రద్దు రాజ్యాంగ విరుద్ధం appeared first on Navatelangana.
తెలంగాణ ప్రజలను నిరుత్సాహపరిచేలా ప్రధాని మోడీ ప్రసంగం : సీపీఐ(ఎం)నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌తెలంగాణ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగం నిరుత్సాహపరిచందనీ, ఆయన ప్రసంగంలో అధికార దాహం తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి లోపించిందని సీపీఐ(ఎం) విమర్శించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. నీతి సూత్రాలు వల్లించి ఊకదంపుడుగా ఉపన్యాసం చేశారు తప్ప ఈ రాష్ట్రానికి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వలేదు? పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు […] The post అధికార దాహం తప్ప రాష్ట్ర సమస్యల పరిష్కారంపై దృష్టేది? appeared first on Navatelangana.
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ రోజు రోజుకు రికార్డ్ పతనాన్ని చవి చూస్తోంది. విదేశీ మారకం నిల్వలపై ఒత్తిడి, భారత స్టాక్ మార్కెట్ల భారీ పతనం, ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో సోమవారం భారీగా కుప్పకూలింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఏకంగా 82 పైసలు క్షీణించి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95.31 వద్ద ముగిసింది. పశ్చిమాసియా శాంతి ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించడం తదనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా స్పందించడంతో ముడి […] The post రూపాయి రికార్డు క్షీణత appeared first on Navatelangana.
రాష్ట్ర వ్యాప్తంగా ఇండ్ల మ్యాపింగ్‌ను వేగవంతం చేయండి : జిల్లా కలెక్టర్లకురాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశంనవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌తెలంగాణలో త్వరలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఇండ్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, డీఈఓలను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నుంచి వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఆదేశం […] The post త్వరలో సర్ షెడ్యూల్ appeared first on Navatelangana.
ప్రాధాన్యత సంతరించుకున్న భేటీ13న అసెంబ్లీలో బలపరీక్షచెన్నై: తమిళనాడు కొత్త సీఎం విజయ్ – మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తో భేటీ అయ్యారు. టీవీకే చీఫ్ సోమవారం డీఎంకే అధినేత నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక వచ్చిన విజయ్ ను మాజీ సీఎం స్టాలిన్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. వారిరువురి మధ్య దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చ జరిగినట్టు టీవీకే వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో మాజీ ఉపముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా […] The post స్టాలిన్ ఇంటికి సీఎం విజయ్ appeared first on Navatelangana.
సత్య, యోగి బాబు ప్రధాన పాత్రలలో పవన్ బసంశెట్టి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.ఈ ప్రాజెక్ట్‌ను నాగార్జున రెడ్డితో కలిసి పవన్ బసంశెట్టి స్వయంగా నయవాయు చిత్రాలు, డ్రీమ్ మూవీ మేకర్స్ బ్యానర్ల పై నిర్మిస్తున్నారు. ఈ రెండు బ్యానర్లకు ఇది ప్రొడక్షన్ నెం.1. అధికారిక ప్రకటనతో పాటు చిత్ర నిర్మాతలు గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌తో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.రామోజీ ఫిల్మ్ సిటీలో మూవీ టీం, ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. […] The post వినోదభరిత ప్రయాణంమొదలైంది appeared first on Navatelangana.

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన మంగళవారం (మే 12) మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం ని ర్వహించనున్నారు. ఇటీవల బిఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తీ సుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పార్టీ బలోపేతానికి సంస్థాగత నిర్మా ణం, సభ్యత్వ నమోదు, జిల్లాలు, శాసనసభ, పార్లమెంటరీ నియోజకవర్గాల ఇంఛార్జ్‌ల నియామకం తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలిపక్షాల ఉప నా యకులు పాల్గొనే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
హీరో శర్వానంద్ , దర్శకుడు సంపత్ నంది కాంబోలో రూపొందుతున్న భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ సినిమా 'భోగి'. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మాణంలో లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. తాజాగా మేకర్స్ డింపుల్ హయాతి పాత్ర లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో 'మందారం’ అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్లో ఆమె ఎర్ర చీరలో బోల్డ్ అండ్ స్టన్నింగ్ లుక్‌లో ఆకట్టుకున్నారు. చేతిలో విసనకర్ర పట్టుకుని, ఇంటెన్స్ హావభావాలతో […] The post లెక్క చేయని ‘మందారం appeared first on Navatelangana.
సన్‌రైజర్స్, టైటాన్స్ ఢీ నేడురాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..నవతెలంగాణ-అహ్మదాబాద్‌ఐపీఎల్19 ప్లే ఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. పాయింట్ల పట్టికలో టాప్-3లో నిలిచిన జట్లు 14 పాయింట్లతో ఉన్నాయి. టాప్-4లో చోటు కోసం ఆరు జట్లు పోటీపడుతున్నాయి. దీంతో లీగ్ దశ ఆఖర్లో ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. నేడు అహ్మదాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ లాంఛనం చేసుకోవటంతో పాటు పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దక్కించుకోనుంది. […] The post అగ్రస్థానంపై కన్నేసి.. appeared first on Navatelangana.
న్యూఢిల్లీ : ఫిఫా 2026 ప్రపంచకప్ మరో నెల రోజుల్లో ఆరంభం కానుంది. అమెరికా, మెక్సికో, కెనడా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సాకర్ సంగ్రామంపై యూరోప్, అమెరికా దేశాలతో పాటు ఆసియాలో అభిమానులు విపరీత ఆసక్తి కనబరుస్తున్నారు. సాధారణంగా, వరల్డ్‌కప్ ఆరంభానికి ముందుగానే ప్రసార హక్కుల ప్రక్రియ ముగుస్తుంది. 2018, 2022 ప్రపంచకప్ చైనా ప్రసారదారుతో ఫిఫా 2017లోనే ఒప్పందం కుదుర్చుకుంది. కానీ, ఈ ఏడాది ప్రపంచకప్‌కు 30 రోజుల కౌంట్‌డౌన్ మొదలైనా.. ఈ ప్రక్రియలో ఎటువంటి […] The post ఫిఫాకు ప్రసార హక్కుల సమస్య appeared first on Navatelangana.

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని పాలకొండ బైపాస్ క్రాసింగ్ వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ స్పోర్ట్స్ రేస్ బైకర్ అతివేగంతో దూసుకొచ్చి కారును ఢీకొన్న సంఘటనలో బైకర్‌తో పాటు అతని స్నేహితుడు, కారులోని ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసు ల కథనం మేరకు.. మహబూబ్‌నగర్ పట్టణంలోని ప్రేమనగర్‌కు చెందిన 8 మంది కుటుంబ సభ్యులు స్థానిక యూబీ గార్డెన్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌కు హాజరయ్యారు. తిరిగి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో స్థానిక పాలకొండ బైపాస్ వద్ద క్రాసింగ్ చేస్తున్న సమయంలో హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చిన స్పోర్ట్స్ బైక్ కారును బలంగా ఢీకొట్టింది.కారులో ఉన్న చిన్నారులు ఉజేఫా (7), అమర్ (2), అర్సియా బేగం (30)తో సహా స్పోర్ట్స్ బైకర్ యాకూబ్ అఫ్జల్ (25)తో పాటు అతని స్నేహితుడితో సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సహాయం అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు పోలీసులు త

మేషం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తులాభాలు పొందుతారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్థులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వృషభం విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుండి శుభాకార్య ఆహ్వానాలు అందుతాయి. మిధునం నూతన ఋణయత్నాలు చేస్తారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కర్కాటకం చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. ఇంటాబయట మానసిక ఒత్తిడులు అధికామౌతాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణయత్నాలు ఫలించవు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సింహం అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తార

పంజాబ్ కింగ్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ ప్రతీకారం తీర్చుకుంది. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారంగా.. ధర్మశాల వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో పంజాబ్ ను ఢిల్లీ దెబ్బకొట్టింది. పంజాబ్ నిర్దేశించిన 211 పగరుల లక్ష్య ఛేదనలో మొదట తడబడిన ఢిల్లీ.. తర్వాత పుంజుకుని అద్భుత విజయాన్ని అందుకుంది. 19 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఢిల్లీ 216 పరుగుల చేసి థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ అక్షర్ పటేల్(56), డేవిడ్ మిల్లర్(51) అర్ధ శతకాలతో రాణించగా.. చివర్లలో అశుతోష్(24), మధవ్(18 నాటౌట్), అకిబ్(10 నాటౌట్) మెరుపులు మెరించడంతో ఢిల్లీ మరో ఓవర్ మిగిలుండగానే మూడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో తమ ప్లేఆఫ్ ఆశలను ఢిల్లీ నిలుపుకుంది.


వాషింగ్టన్ : అమెరికాఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అత్యంత బలహీన స్థితిగా మారిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్ తన శాంతి ప్రతిపాదనలో భాగంగా పంపిన నివేదికను ట్రంప్ “ చెత్త” అని కొట్టి పారేశారు. ఈ కాల్పుల విరమణ ఒప్పందం “ఒకశాతం మాత్రమే జీవించే అవకాశం ఉన్న రోగిలా ” ఉందని పేర్కొన్నారు. ఇరాన్ తన 10 పాయింట్ల ప్రతిపాదనలో యుద్ధ పరిహారం, హర్మూజ్ జలసంధిపై సార్వభౌమాధికారం, ఆంక్షల ఎత్తివేత, చమురు విక్రయాలపై నిషేధాన్ని తొలగించాలని డిమాండ్ చేసింది. దీనిని అమెరికా అంగీకరించలేదు. ఇరాన్ తన ప్రతిపాదనను సమర్ధించుకుంటూ ,అమెరికా జోక్యాన్ని సార్వభౌమాధికార ఉల్లంఘనగా పరిగణిస్తామని హెచ్చరించింది.

న్యూఢిల్లీ : పశ్చిమాసియా సంఘర్షణ వల్ల ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి దేశ పౌరులకు ప్రధాని నరేంద్రమోడీ చేసిన విజ్ఞప్తులపై కాంగ్రెస్ అగ్రనేత లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని చేసిన వ్యాఖ్యలు వైఫల్యానికి నిదర్శనమని, సవాళ్లకు రాజీపడ్డారని,ఇక దేశాన్ని నడపలేరని విమర్శించారు. ఈమేరకు రాహుల్ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఆదివారం మోడీ ప్రజలను త్యాగాలు చేయాలని పిలుపునిచ్చారు. బంగారం కొనవద్దు, విదేశాలకు వెళ్లవద్దు, పెట్రోల్ తక్కువగా వాడండి, ఎరువులు , వంటనూనె వాడకం తగ్గించండి. మెట్రోలో ప్రయాణించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి వంటి విజ్ఞప్తులను దేశ ప్రజలకు చేశారు. ఇవి సలహాలు కావు, వైఫల్యానికి నిదర్శనం. గత 12 ఏళ్లలో దేశం ఇప్పుడు ప్రజలకు ఏమి కొనాలి? ఏమి కొనకూడదు? ఎక్కడికి వెళ్లకూడదు? అని చెప్పాల్సిన దుస్థితికి చేరుకుంది. తన జవాబుదారీ తనం నుంచి తప్పించుకోవడానికి ,మోడీ పదేపదే బాధ్యతలను ప్రజల పైకి నెడుతున్నారు. రాజీపడిన ప్రధాని ఇకపై దేశాన్ని నడపగల సమర్థుడు కాదని రాహుల్ విమర్శించారు.
