5408 articles



మనతెలంగాణ/జనగాం ప్రతినిధి : 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని, లేనిపక్షంలో ఆమరణ దీక్ష చేస్తానని టీచర్ ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి హెచ్చరించారు. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ విడుదలై, అనంతరం నియామకం పొందిన 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం మెమో నెం. 57/4, 57/5లను జారీ చేసిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసిందని పేర్కొన్నారు. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. పిఆర్‌టియుటిఎస్ జనగాం జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులకు ప్రతిభ అవార్డులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్‌సి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ, 2003 డిఎస్‌సి టీచర్ల విషయంలో అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తూ కోర్టులో ఎస్‌ఎల్‌పి వేయడం సరైన చర్య కాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఎస్‌ఎల్‌పిని వెనక్కి తీసుకొని, 2003 డిఎస్‌సి ఉపాధ్యాయులకు పాత పెన

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అధ్యక్షతన ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో కీలక సమావేశం జరగనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ప్రధాన కార్యదర్శులు, శాసనసభ, మండలిపక్షాల ఉప నాయకులు పాల్గొనే ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, పార్టీ ఇంఛార్జిల నియామకం సహా పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించనున్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటన ముగించుకొని ఆదివారం రాత్రి గుజరాత్ బయలుదేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి బయలుదేరిన ప్రధాని మోడీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ వీడ్కోలు పలికారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న జనగణనలో బీసీ కుల గణనకి సంబంధించి హౌస్ హోల్డర్స్ కాలం 13లో లేదని, బీసీ కుల గణన చేర్చాలని ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేస్తూ ప్రోటోకాల్ చైర్మన్ హర్కర వేణుగోపాల్‌తో కలిపి వీరు వినతి పత్రం సమర్పించారు.ప్రధానికి ఘనంగా వీడ్కోలు పలికిన బిజెపి నేతలు హైదరాబాద్ పర్యటన ముగించుకుని గుజరాత్ బయలుదేరిన ప్రధాని నరేంద్రమోడీకి రాష్ట్ర బిజెపి నేతలు వీడ్కోలు పలికారు. బేగంపేట్ విమానాశ్రయం వరకు వెళ్లి ఆయన రాష్ట్ర పర్యటనకు విచ్చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ వీడ్కోలు పలికారు. వీడ్కోలు పలికిన వారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, పలువురు లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర నాయకులు ఉన్నారు.
అధిక బరువును తగ్గించుకొని ఫిట్‌గా మారడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. చక్కటి పోషకాహారం తీసుకోవడం, డైటింగ్, వ్యాయామాలు చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఇవి కూడా ఎలా పడితే అలా కాకుండా బ్యాలన్స్డ్గా చేసినప్పుడే ఆశించిన ఫలితం దక్కుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి 30-30-30 రూల్ చక్కగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. ఆ నియమం ఏమిటో.. బరువు తగ్గించడంలో ఇది ఎలా సహాయపడుతుందో ఈరోజు తెలుసుకుందాం! ఇలా అనుకుంటే అలా ఎవరు బరువు తగ్గలేరు. ఇది […] The post బరువు తగ్గాలంటే… appeared first on Navatelangana.

బలమైన, ఆరోగ్యకరమైన జుట్టును కాపాడుకోవడంలో జుట్టు, తల చర్మం ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. వేసవి నెలల్లో అధిక వేడి, తేమ, చెమట, ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు బలహీనపడి, తల చర్మం పొడిబారి, జుట్టు రాలడం, చిక్కుపడటం, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, కాలానుగుణ నష్టం నుంచి జుట్టును కాపాడటానికి మన రోజువారీ అలవాట్లు జుట్టు సంరక్షణ పద్ధతులు చాలా కీలకమవుతాయి. ుట్టు సంరక్షణ అనేది కేవలం పైపైన చేసే చికిత్సల […] The post అనుసరించాల్సిన చిట్కాలు appeared first on Navatelangana.


సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రజల ఉత్సాహం తెలంగాణలో రాజకీయ మార్పునకు నాంది పలుకుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలకంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు బయట ఉన్నారని, ఇది ప్రజల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పట్ల ఉన్న అపారమైన అభిమానానికి నిదర్శనమన్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణకు వచ్చిన ప్రధానికి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుత స్వాగతానికి కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణతో ప్రత్యేకమైన అనుబంధం ఉందని అన్నారు. హైదరాబాద్ రాష్ట్రం నిజాం పాలన నుంచి భారతదేశంలో విలీనమైన చారిత్రాత్మకమైన సెప్టెంబర్ 17నే మోడీ జన్మదినం కూడా కావడం తెలంగాణ ప్రజలకు మరింత గొప్ప భావోద్వేగ అనుబంధాన్ని కలిగిస్తోందని రాంచంద్రరావు పేర్కొన్నారు. తెలంగాణతో పాటు దేశ అభివృద్ధికి దోహదపడే రూ.9,700 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ దేశానికి అంకితం చేయడం పట్ల భారతీయ జనతా పార్టీ తెలంగాణ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న పోరాటం జాతిని విభజించే


నవతెలంగాణ – హైదరాబాద్: సూర్యాపేట జాఆ్ల బాల భవన్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అభివృద్ధి కమిటీ సభ్యులు హమీద్ ఖాన్, పేరెంట్స్ కమిటీ ఉపాధ్యక్షురాలు వెన్న కవిత రెడ్డి, యోగ గురువు నాగేశ్వర్ రావు హాజరై నటరాజ స్వామికి సరస్వతి దేవి చిత్ర పటానికి పూల మాలలు వేశారు. తదుపరి చిన్నారులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు చేశారు. అదేవిధంగా అమ్మ గురించి, మహిళా, ఆడబిడ్డ విలువ […] The post సూర్యాపేట బాల భవన్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలు appeared first on Navatelangana.

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి గా ప్రమాణం చేసిన విజయ్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. తిరు సి జోసెఫ్ విజయ్‌కు అభినందనలు, ఆయన పదవీ బాధ్యతల దశలో శుభాకాంక్షలు, తమిళ ప్రజల జీవితాలు విలసిల్లే దిశలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు.
నవతెలంగాణ – హైదరాబాద్‌హైదరాబాద్ పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ దేశ ఆర్థిక పరిస్థితి, అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇంధన వినియోగం, విదేశీ మారక ద్రవ్యం ఆదా విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి అంటూ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో, దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా పెట్రోల్, డీజిల్‌ను […] The post పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించండి: ప్రధాని నరేంద్ర మోడీ appeared first on Navatelangana.




హైదరాబాద్ : బిజెపి పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు బిసిలకు అన్యాయం చేస్తూనే ఉందని, బిసిలకు ద్రోహం చేస్తున్న బిజెపి చరిత్రలో పతనం కాక తప్పదని అఖిలపక్ష నేతలు తీవ్రంగా హెచ్చరించారు. జాతీయ జనగణనలో సమగ్ర కులగణన చేపడతామన్న ప్రధాని హామీని విస్మరించినందుకు నిరసనగా ఆదివారం ప్రధాని తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తూ బిసి సంక్షేమ సంఘం రాష్ట్రవ్యాప్తంగా నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేసింది. హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ నిరసనలో షాద్‌నగర్ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ ఓబిసి స్టేట్ చైర్మన్ ఈర్లపల్లి శంకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎంఎల్‌సి ప్రొఫెసర్ కోదండరాం, బిఆర్‌ఎస్ శాసనమండలి ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంఎల్‌సి నెల్లికంటి సత్యం, సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అబ్బాస్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస

నవతెలంగాణ-మద్నూర్ఆదివారం హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు మద్నూర్ మండలంలోని సోమూరు గ్రామ సర్పంచ్ సంగ్రామ్ పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు సోమూర్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ దేశ ప్రజల కోసం సురక్షితమైన పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పాలన దేశ ప్రజలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు […] The post ప్రధాని మోడీ సభకు భారీగా తరిలిన సోమూర్ ప్రజలు appeared first on Navatelangana.


నవతెలంగాణ-మద్నూరడివిజన్ స్థాయి ప్రజావాణిని స్థానిక ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ ఎండీ ముజీబ్ సూచించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజల సమస్యలు సత్వరం పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ప్రతి సోమవారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని మరోసారి ఆయన గుర్తు చేశారు. The post డివిజన్ స్థాయి ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: తహశీల్దార్ appeared first on Navatelangana.