5593 articles


నవతెలంగాణ – హైదరాబాద్ : కరీంనగర్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య వివాదం కారణంగా కరీంనగర్లో నేడు బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఈ బంద్‌లో పాల్గొనకుండా ఉండేందుకు ముందస్తు చర్యగా గంగుల కమలాకర్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనను ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా […] The post మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్ appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : సంగారెడ్డిలోని ఆర్సీపురంలో విషాదం చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి నగర్ కాలనీలో ఆడుకునేందుకు వెళ్లిన నాలుగేళ్ల బాలుడు గిరిధర్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి మృతిచెందాడు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ వేంకటేశ్వర్లు కుమారుడు గిరిధర్ ఆడుకునేందుకు వెళ్లి లిఫ్ట్ ఎక్కాడు. అనంతరం అందులో ఇరుక్కుపోయాడు. లిఫ్ట్ నుంచి భారీ శబ్దం రావడంతో కుటుంబ సభ్యులు, అపార్ట్‌మెంట్ వాసులు స్పందించి అతన్ని బయటకు తీశారు. స్పృహలేని స్థితిలో ఉన్న బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. The post సంగారెడ్డిలో దారుణం..లిఫ్ట్‌లో ఇరుక్కుని బాలుడు మృతి appeared first on Navatelangana.

కేరళలో ఓట్లు లెక్కించిన తర్వాత వెలువడిన ఫలితాలు కేవలం ఒక రాష్ట్ర ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు.. అవి భారత రాజకీయ చరిత్రలో ఒక మహా అధ్యాయానికి తెరపడ్డాయి. పినరయి విజయన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసారు. దశాబ్దం పాటు కొనసాగిన పరిపాలనకు ముగింపు పలికింది. కానీ ఈ ఓటమి అంటే కేవలం ఒక పార్టీ అధికారం కోల్పోవడం కాదు. 1977 నుండి భారతదేశంలో కనీసం ఒక్క రాష్ట్రమైనా కమ్యూనిస్టు పాలనలో ఉండేది. ఇప్పుడు ఆ స్థితి మొదటిసారి మారిపోయింది. స్వాతంత్య్రానికి పూర్వం అంకురించి, స్వాతంత్య్రానంతరం పల్లవించి, కోట్లాది కార్మికులకు, రైతులకు ఆశాజ్యోతిగా నిలిచిన ఎర్రజెండా.. ఇప్పుడు ఏ అధికార సౌధంపైన ఎగరడం లేదు. కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో కేవలం పార్టీ రాజకీయంగా మాత్రమే ప్రారంభం కాలేదు. అది ఒక సామాజిక చలనంగా, వర్గపోరాటంగా, జీవన విధానంగా పుట్టింది. 1946 నుండి 1951 వరకు తెలంగాణలో సాయుధ రైతు పోరాటాన్ని నడిపించింది, భూస్వాములకు వ్యతిరేకంగా గెరిల్లా యుద్ధాన్ని నిర్వహించింది. 1950లు, 1960లలో భారత పార్లమెంట్‌లో ప్రధాన ప్రతిపక్ష స్థానాన్ని అలంకరించింది. అత్యంత చారిత్రాత్మకమైన ఘట్టం 1957లో జరిగింది. కేరళ ప్రపంచంలో మొట్టమొదటి ప్

దుబాయ్: సముద్రంలో పడి ఓ భారతీయుడు మృతి చెందిన సంఘటన దుబాయ్‌లో జరిగింది. ఈ ఘటనపై భారత్ కాన్సులేట్ తన ట్విట్టర్ లో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నౌక యజమానితో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. మృతుడి కుటుంబానికి అండగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తామని కాన్సులేట్ అధికారులు తెలిపారు.

కార్తిక్ జయంతిని హీరోగా పరిచయం చేస్తూ రేసన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ రాయవలస. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ.జె నిర్మించగా మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. శుక్రవారం మేకర్స్ టీజర్ లాంచ్ చేశారు. యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ఈ వేడుకకు హాజరై మాట్లాడుతూ “టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, వాళ్ల అమ్మ డైరెక్టర్‌గా, వాళ్ల నాన్న ప్రొడ్యూసర్‌గా ఉండడం చాలా క్రేజీగా అనిపించింది. రాధిక మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. శ్రీష స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తోంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను“అని అన్నారు. హీరో కార్తీక్ మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది. ‘రాయవలస’ వాస్తవ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ. దానికి అందరూ కనెక్ట్ అవుతారని, ఆదరిస్తారని నమ్ముతున్నాను”అని తెలిపారు. డైరెక్టర్ రాధిక జయంతి మాట్లాడుతూ “రాఖీ చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాతో ‘రాయవలస’ రాధికగా గుర్తింపు తెచ్చుకుంటానని నమ్మకం ఉంది. ఇందులో ఐదు పాటలు ఉన్నాయి. అన్నీ కథకి తగ్గట్టుగానే ఉంటాయి”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ దామోదర్ ప్రసాద

యాక్షన్, ఎమోషనల్, రస్టిక్ డ్రామాలతో ప్రేక్షకులను మెప్పించిన హీరో కార్తీ ఇప్పుడు పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నాడు. తాజాగా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌కు మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. మ్యాడ్ సినిమాతో యూత్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకున్న కళ్యాణ్ శంకర్, ఇప్పుడు కార్తీ వంటి ఎనర్జిటిక్ హీరోతో కలిసి పని చేయడం ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఆయన రైటింగ్ స్టైల్, ఫన్ డైలాగ్స్, యూత్‌ఫుల్ కామెడీ ట్రీట్‌మెంట్ ఈ సినిమాకు ప్రధాన బలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందట. ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. విడుదల తేదీతో పాటు ఇతర నటీనటుల వివరాలను మేకర్స్ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసంప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన కులగణన నిర్ణయం చారిత్రాత్మకం తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్యమన తెలంగాణ/కాచిగూడ : కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తుందని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణ య్య విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన కులగణన నిర్ణయం చారిత్రాత్మకమని, దేశంలోని ఓబీసీ సంక్షేమాభివృద్ధి కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంతోనే సాధ్యమని ఆయన పేర్కొ న్నారు. శుక్రవారం కాచిగూడలోని మహారాజ హోటల్ లో బీసీ సంఘాల నేతలు నీల వెంకటేశ్, మోదీ రాందేవ్ ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన 13 బీసీ సంఘాల సమావేశంలో ఆర్. కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 1931 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం బీ జేపీ ప్రభుత్వ ధైర్య నిర్ణయమని పేర్కొ న్నారు. జనాభా లెక్కలు బయటకు వచ్చిన తర్వాత విద్య, ఉద్యోగాలు, రాజకీయాలు, ఆర్థిక రంగాల్లో బీసీలకు జనాభా ప్రకారం హక్కులు, రిజర్వే షన్లు కల్పించే మార్గం సులభమ వుతుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం బీసీలకు అనేక కీ


అమరావతి: బాలికపై చర్చి పాస్టర్ అత్యాచారం చేసి అనంతరం నెలసరి తప్పటంతో గర్భనిరోధక మాత్రలు ఇవ్వడంతో తీవ్ర రక్తస్రావం కావడంతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లాలో జరిగింది. కామవరపు కోట మండలంలోని ఓ గ్రామానికి చెందిన చౌటపల్లి రాంబాబు చర్చిచిని నిర్మించి ప్రార్థనలు చేసుకుంటున్నాడు. కూలిపనులు చేసుకునే ఓ కుటుంబం పాస్టర్ వద్దకు వచ్చి ప్రార్థనలు చేయించుకునేది. సదరు కుటుంబంలో బాలిక(14)కు పాస్టర్ మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. పలుమార్లు బాలికపై అత్యాచారం చేయడంతో ఈ విషయం బయటకు చెబితే శపిస్తానని బెదిరించాడు. ఈ విషయం బాలికు బయటకు చెప్పలేదు. బాలికకు నెలసరి రాకపోవడంతో పాస్టర్ ఆమెకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చాడు. అధిక మోతాదులో బాలికకు మాత్రలు ఇవ్వడంతో రక్తస్రావంతో బాధపడుతున్న ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లింది. వెంటనే ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన పాస్టర్ శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.










అమరావతి: ఫోన్ చూస్తు ఆటో డ్రైవర్ భవనం పైనుంచి పడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎనికేపాడులోని శివాలయంలో వీధిలో నాగరాజు(25) అనే ఆటో డ్రైవర్ నివసిస్తున్నాడు. మూడో తేదీ రాత్రి భవనం పిట్టగోడపై కూర్చొని నాగరాజు ఫోన్ చూస్తున్నాడు. తల్లి నాగమణి భవనం పైకి వెళ్లి కుమారుడిని కిందకు రమ్మని చెప్పింది. అర్థరాత్రి రెండు గంటల సమయంలో నాగరాజు పైనుంచి కిందపడిపోవడంతో పెద్ద శబ్ధం వచ్చింది. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అతడు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి 1:45 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇది స్వల్ప భూకంపమే కావడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీరామపురం కాలనీ, సీఎస్ఆర్ శర్మ కాలేజీ పరిసర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. The post ఒంగోలులో భూప్రకంపనలు.. appeared first on Navatelangana.

నవతెలంగాణ – హైదరాబాద్ : టీమిండియా, పంజాబ్ కింగ్స్ యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకు సోషల్ మీడియాలో ఎలాంటి వ్లాగ్స్ (వీడియో బ్లాగ్స్) చేయవద్దని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. సహచర ఆటగాడు యజువేంద్ర చాహల్‌కు సంబంధించిన ఒక వీడియో వివాదాస్పదం కావడమే ఇందుకు కారణంగా వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ కింగ్స్ జట్టు అహ్మదాబాద్ […] The post అర్షదీప్ సింగ్‌కు బీసీసీఐ వార్నింగ్… appeared first on Navatelangana.
