5620 articles

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాలో పోషించిన పాత్రకు తాను సూట్ అవ్వలేదేమోనని అనిపించిందని ఆమె చెప్పడం చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల క్రితం ఆ సినిమా ప్రమోషన్స్ లో చేసిన కామెంట్స్ ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైనా.. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను పొందలేకపోయింది. ముఖ్యంగా సౌత్ ఆడియన్స్‌కు ఆ కథ, పాత్రలు అంతగా కనెక్ట్ కాలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇక ఈ సినిమాకు ఓకే చెప్పడానికి కారణాల గురించి మాట్లాడిన సాయి పల్లవి.. “ఆ సమయంలో నేను వరుసగా భావోద్వేగాలకు సంబంధించిన సినిమాల్లో నటిస్తున్నా. అందుకే మనసుకు హాయిగా అనిపించే కథ చేయాలని అనిపించింది. ఏక్ దిన్ కథ విన్నప్పుడు నాకు బిఫోర్ సన్ రైజ్ సినిమా గుర్తొచ్చింది. ఆ చిత్రం నాకు చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే చెప్పా’‘ అని తెలిపారు.

టివికెకు సిపిఐ మద్దతు విషయంలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే కీలక పాత్ర పోషించారు. ఆయన శుక్రవారం అర్జంటుగా సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజాతో ఫోన్‌లో మాట్లాడారు. తమిళనాడులో విజయ్ పార్టీ టివికె ఏర్పాటు కావాలంటే సిపిఐ మద్దతు కూడా అవసరం అని లేకపోతే కేంద్ర ప్రభుత్వ ఏదో సాకుతో అక్కడ కొత్త ప్రభుత్వ స్థాపనలో జాప్యం చేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో బిజెపికి అవకాశం ఇవ్వకుండా చేయాల్సి ఉందని తెలిపారు. తరువాత రాజా తాము ఆలోచించి చెపుతామని పేర్కొన్నారు. డిఎంకె సహా ఇతర పార్టీలతో మాట్లాడాల్సి ఉంటుందని రాజా ఖర్గేకు చెప్పారు . తరువాత ఈ క్రమంలోనే టివికెకు మద్దతు ఇచ్చినట్లు స్పష్టం అయింది.

ఇండోనేసియాలో అగ్నిపర్వతం పేలుడు ఘటనలో కనీసం ముగ్గురు పర్వతారోహకులు మృతి చెందారు. ఇండోనేసియా మారుమూల దీవి హల్మాహెరాలో మౌంట్ దుకోనో గురువారం పర్వతారోహకులు సాహస యాత్రకు వెళ్లారు. ఇదే దశలో అగ్నిపర్వతం బద్దలు అయింది. 1355 మీటర్ల ఎతైన గుట్టల వద్దకు వెళ్లుతుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రాంతం పర్వతారోహకులకు నిషిద్ధ ప్రాంతంగా ఉంది. అయినప్పటికీ వీరు ఈ ప్రమాద భరిత మార్గంలో వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని ఈ ప్రాంతపు పోలీసు అధికారి ఎర్లిచ్సన్ పసరిబు తెలిపారు.

వరి కోతలు కోసి ఇరవై ఏడురోజులు దాటింది. ఇరవై రోజుల వరకు కొనుగోలు చేసే నాథుడే లేడు. ప్రతిరోజు ఎండల్లో వడ్లను ఎండబెట్టడం కొరకు నేర్పుతూ కుప్పలు పోస్తూ మండేఎండల్లో శ్రమిస్తూ రైతులు వడదెబ్బకు తల్లడిల్లి పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వరి కొనుగోలు చేయమని మొండికేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంతో ఏమి పట్టనట్లు ఉదాసీనంగా ఉంది. లక్షలాదిమంది తెలంగాణ, దేశంలోని రైతాంగం దిక్కుతోచక ఎండల్లో వరి కుప్పల […] The post మలమల మాడే ఎండల్లో…దినదిన గండంగా రైతులు! appeared first on Navatelangana.

దేశంలో కార్మిక వర్గం నేడు ఎదుర్కొంటున్న సంక్షోభం సాధారణ ఆర్థిక సమస్య కాదు. అది పాలక వర్గాల విధానాల వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్న సామాజిక-ఆర్థిక సంక్షోభం. వేతన స్తంభన, పనిగంటల పెంపు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఒప్పంద కార్మిక వ్యవస్థ విస్తరణ, ఉద్యోగ భద్రత లేకపోవడం-ఈ నాలుగు అంశాలు కలిసి కార్మికుల జీవితాలను అస్తిరత్వంలోకి నెట్టేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇటీవల జరిగిన కార్మిక నిరసనలు వారి సమస్యలన్నింటినీ వెలుగులోకి తెచ్చాయి.నోయిడా, ఫరీదాబాద్ వంటి పారిశ్రామిక కేంద్రాలు దేశ అభివృద్ధికి […] The post నోయిడాలో కార్మికుల ఆందోళనలు -డబులింజన్ సర్కార్ ధోరణులు appeared first on Navatelangana.

భూమిని దోచుకుంటూ, వనరులను వశపర్చుకుంటూ, ప్రకృతిని నాశనం చేసుకుంటూ తీసుకొస్తున్న ‘అభివృద్ధి’ నమూనా చివరకు నీటిచుక్క కోసం ఒకరినొకరు చంపుకునే దారుణస్థితికి తీసుకొచ్చింది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా నలభై రెండు మంది చనిపోయారు. ఆఫ్రికాలోని చార్డ్ దేశంలో ఇటీవల జరిగిన ఈ విషాదం మానవ నాగరికత వైఫల్యానికి నిలువెత్తు సాక్ష్యం. వాదీ ఫిరా ప్రావిన్స్‌లో ఉన్న ఒకే బావి స్థానికులకు ఆధారం. కాగా, దాహం తీర్చుకోవడానికి ఆ బావి వద్దకు వెళ్లిన కొంతమంది తిరిగి […] The post రక్త‘దాహం’ appeared first on Navatelangana.

కార్తిక్ జయంతిని హీరోగా పరి చయం చేస్తూ రే సన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'రాయవలస. ఈ చిత్రాన్ని గోపీ కృష్ణ జె నిర్మించగా, మహిళా దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ‘లవ్ టైడ్ బై ఫేట్అనే ట్యాగ్‌లైన్ వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంటును ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్లో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. కార్తీక్ హీరోగా, […] The post వాస్తవ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘రాయవలస appeared first on Navatelangana.

భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్ల మీద కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. విక్రమ్ సహిదేవ్, సంధ్య వశిష్ట జంటగా నటించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కి ఓ ముఖ్య పాత్రను కూడా పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘లబ్బరు బొమ్మ’ అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ రిలీజ్ అయ్యింది. ఇందులో తారక్ పొన్నప్ప […] The post స్టెప్పులు వేయించే ‘లబ్బరు బొమ్మ` appeared first on Navatelangana.


విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నేతృత్వంలోని ప్రముఖ బ్యానర్ 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి మరో క్రేజీ ప్రాజెక్ట్ రాబోతుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తుండగా, రచయిత నుంచి దర్శకుడిగా మారిన కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. సందీప్ కిషన్ పుట్టినరోజు సందర్భంగా 'పవర్‌పేట చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో హంగామాతో హై వోల్టేజ్ మూడ్‌లో ప్రారంభమవుతుంది. అభిమానుల అరుపులు, సంబరాల మధ్య హీరో ఎంట్రీ, […] The post ‘పవర్ పేటలో సేనాపతి రవిగా.. appeared first on Navatelangana.

వెంకటేష్ మహా దర్శకత్వంలో సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. వెంకటేష్ మహా దర్శకత్వం వహించడమే కాకుండా కథ, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. తాజాగా మేకర్స్ ఈ చిత్రాన్ని జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. లీజ్ డేట్ పోస్టర్‌లో సత్యదేవ్ వయసు పైబడిన రాయల్ లుక్‌లో కనిపించారు. పోస్టర్ మొత్తం సైకలాజికల్ డ్రామాకు తగ్గట్టుగా ఇంటెన్స్ వాతావరణాన్ని చూపించింది. […] The post వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్ appeared first on Navatelangana.


నవతెలంగాణ హైదరాబాద్: తమిళనాడు రాజకీయాల సందిగ్ధత తొలగడంలేదు. రేపు టీవీకే అధ్యక్షులు విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా అనిశ్చితి పూర్తిగా వీడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకే అధ్యక్షులు విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వచ్చినప్పటికీ.. లోక్ భవన్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాకపోవడంపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు.. […] The post తమిళ రాజకీయాల్లో మరో ట్విస్ట్ appeared first on Navatelangana.

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఐ యామ్ గేమ్’ ప్రస్తుతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తున్న చిత్రాల్లో ఒకటిగా మారింది. దక్షిణ భారతదేశంలోని 100కి పైగా లొకేషన్లలో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాల గురించి మాట్లాడుతూ,’ నా కెరీర్లో ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఇది అత్యంత స్టైలిష్ ఫిల్మ్. సినిమాలో నా పాత్రతో పాటు మొత్తం […] The post ‘ఐ యామ్ గేమ్` రిలీజ్ డేట్ ఫిక్స్ appeared first on Navatelangana.


విడుదలకు ముందే రామ్ చరణ్ నటించిన ‘పెద్ది` సంచలనాలు సృష్టిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ తుఫాన్‌లా దూసుకెళ్తున్నాయి. బుకింగ్స్ ప్రారంభమైన కేవలం నాలుగు గంటల్లోనే సినిమా 100కె డాలర్ల మార్క్‌ను దాటేసి ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ట్రైలర్ కూడా విడుదల కాకముందే ఈ స్థాయి ఓపెనింగ్ రావడం సెన్సేషనల్ అయ్యింది. రామ్ చరణ్ స్టార్ పవర్‌పై ప్రేక్షకులకు ఉన్న నమ్మకం, బుచ్చిబాబు […] The post 4 గంటల్లోనే ఆల్‌టైమ్ రికార్డ్ appeared first on Navatelangana.

గల్ఫ్ యుద్ధం తిరిగి రగులుకుంది. శుక్రవారం ఇరాన్ గల్ఫ్‌దేశం అరబ్ ఎమిరేట్ప్‌సై డ్రోన్లుచ క్షిపణులతో దాడికి దిగింది. దీనితో కొంతకాలంగా అమలులో ఉన్న కాల్పుల విరమణకు గండిపడే పరిస్థితి ఏర్పడింది. తాము ఇరాన్ దాడులను తిప్పికొట్టామని యుఎఇ శుక్రవారం ప్రకటించింది. మరో వైపు హర్మూజ్ జలసంధిలో మూడు నౌకలపై ఇరాన్ నౌకాదళం దాడులను నివారించామని అమెరికా తెలిపింది. అంతేకాకుండా ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలను దెబ్బతీశామని కూడా యుఎస్ సైనిక వర్గాలు నిర్థారించాయి. యుఎఇలో ఇరాన్ దాడులలో ఏ మేరకు నష్టం జరిగిందనేది వెల్లడికాలేదుహర్మూజ్‌లోని క్వెషెమ్ దీవులలో తాము శత్రుదేశ బలగాలతో తలపడ్డామని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ద్వారా ఇరాన్ సైనిక వర్గాలు తెలిపాయి. అయితే వివరాలను వెల్లడించలేదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్కతా నైట్‌రైడర్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.పాతుమ్ నిస్సాంక 50 పరుగులతో రాణించాడు. అశుతోష్ శర్మ (39: 28 బంతుల్లో 3 సిక్స్, 3 ఫోర్లు) జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. కోల్కతా బౌలర్లలో సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, అనుకుల్ రాయ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీని కట్టడి చేశారు.

హర్మూజ్ జలసంధి మీదుగా చమురు, గ్యాస్ నౌకలను పెద్ద ఎత్తున ఇరాన్ సైన్యం అడ్డుకొంటోందని అమెరికా తెలిపింది. ఈ మార్గంలో తాము ఇరాన్ దాడులను తిప్పికొట్టినట్లు , వేరే దేశాలకు చెందిన మూడు నౌకలను రక్షించినట్లు యుఎస్ నేవీ శుక్రవారం తెలిపింది. అమెరికా బలగాలపై దాడులకు ఎంచుకున్న ఇరాన్ సైనిక స్థావరాలను దెబ్బతీశామని కూడా వివరించారు. ఇరాన్ పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని, వీటిని తాము ఎదుర్కొన్నామని అమెరికా సైనిక విభాగం తెలిపింది. అయితే కొన్ని పరస్పర కాల్పులు, దాడుల ఘటనలు జరుగుతూ ఉన్నా, మొత్తం మీద అనుకున్న విధంగా కాల్పుల విరమణ సాగుతోందని వాసింగ్టన్‌లో ట్రంప్ తెలిపారు. ఇరాన్ తమ చర్యలతో అమెరికాను బెదిరించాలని చూసింది. వారిని చిత్తుచేశామని చెప్పారు. హర్మూజ్ మీదుగా వెళ్లే తమ జాబితాలో లేని దేశాల నౌకలను గుర్తించి , వాటిపై భారీ సుంకాలు విధించేందుకు ఇరాన్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇరాన్ ప్రత్యేకంగా ఓ సంస్థను అధికారికంగా ఏర్పాటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య గత నెల నుంచి మొత్తం మీద కాల్పుల విరమణ ప్రక్రియ అమలులోకి వచ్చింది.



భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శాసనసభ పక్ష నేతగా ఎంపికయ్యారు. కోల్‌కతాలో అమిత్‌షా సమక్షంలో భాజపా శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం బెంగాల్ కొత్త ముఖ్యమంతిగా సువేందు అధికారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. శనివారం ఆయన పశ్చిమ బెంగాల్ తొమ్మిదో ముఖ్యమంత్రిగా, అలాగే రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్‌షా, ఇతర కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. రెండుసార్లు మమతా బెనర్జీని ఓడించి.. ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించలేదు. గత కొన్నేళ్లుగా ఆయన బెంగాల్‌లో అత్యంత ప్రభావశీల భాజపా నాయకుడిగా ఎదిగారు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుసగా రెండు ఎన్నికల్లో గట్టి దెబ్బ కొట్టడం ఆయన రాజకీయ ప్రస్థానంలో పెద్ద మైలురాయిగా నిలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు అధికారి ఆ
