ఏపీలోని మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో 150 ఎంఎల్, 200 ఎంఎల్ కొత్త సైజుల్లో మద్యం బాటిళ్లు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 90, 180, 375, 750, 1000 ఎంఎల్ పరిమాణాల్లో లిక్కర్ బాటిళ్లు విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. మద్యం తయారీ కంపెనీల అభ్యర్థన మేరకు ఎక్సైజ్ శాఖ కొత్త సైజులకు అనుమతులు ఇచ్చింది.
కొత్త నిబంధనల ప్రకారం ఒక కేసులో 200 ఎంఎల్ బాటిళ్లు 45, 150 ఎంఎల్ బాటిళ్లు 60 ఉండనున్నాయి. ఈ కొత్త సైజుల ధరలు ఆయా బ్రాండ్‌ల ప్రస్తుత ధరల ఆధారంగానే నిర్ణయించబడతాయని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు తెలంగాణలో మాత్రం మద్యం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తయారీ సంస్థల డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ధరల పెంపుపై పరిశీలన కొనసాగిస్తోంది.













