ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య రంగంలో మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర కేబినెట్ శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ (SIU) స్థాపనకు ఆమోదం తెలిపింది. సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో శ్రీ సిటీ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది.
జూలై 2న తాత్కాలిక క్యాంపస్‌ను మంత్రి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. సంప్రదాయ విద్యా విధానానికి భిన్నంగా, విద్యార్థులు మొదటి సంవత్సరం నుంచే పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్‌లు, వర్క్‌ప్లేస్ అనుభవం పొందేలా కోర్సులు రూపొందించారు.
2026-27 విద్యా సంవత్సరంలో కంప్యూటర్ సైన్స్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్‌లో బీటెక్ కోర్సులు, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, డిజిటల్ మార్కెటింగ్‌లో బీబీఏ కోర్సులతో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. నాన్-మెడికల్ కోర్సుల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వ కోటా కింద అందించనుంది. విద్యతో పాటు పరిశ్రమ అనుభవాన్ని కలిపే ఈ మోడల్ విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.













