ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో తన కాన్వాయ్‌ను అకస్మాత్తుగా ఆపి రోడ్డుపక్కన తాటి ముంజలు విక్రయిస్తున్న వ్యాపారి దగ్గరకు వెళ్లారు. చంద్రబాబు తన భార్య భువనేశ్వరితో కలిసి తాటి ముంజలు తింటూ వ్యాపారులతో ముచ్చటించారు. సీఎం రాకతో అక్కడికి స్థానికులు భారీగా చేరుకుని మొబైల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు.
వేసవిలో చల్లదనాన్ని ఇచ్చే తాటి ముంజలు గ్రామీణ సంప్రదాయ ఆహారంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా సీఎం సోషల్ మీడియా వేదిక Xలో స్పందిస్తూ, “ఇందులో కల్తీ లేదు, కార్బైడ్ లేదు, పురుగుమందుల ప్రభావం లేదు. కుప్పం ప్రజల మనసుల్లా స్వచ్ఛమైన ఈ తాటి ముంజలు తినడం ఎంతో ఆనందంగా అనిపించింది” అని పేర్కొన్నారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.














