తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరింత తీవ్రమై, కొన్ని తీరప్రాంత జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45–47°C వరకు చేరే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు పలు జిల్లాలకు 5 రోజుల రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావొద్దని, అత్యవసరమైతే మాత్రమే జాగ్రత్తలతో వెళ్లాలని సూచిస్తున్నారు.
తెలంగాణలో కూడా వడగాలులు తీవ్రంగా వీచనున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వచ్చే 3 రోజుల పాటు హీట్‌వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.














