విజయవాడ నగరంలో ట్రాఫిక్ రూల్స్‌ను లైట్ తీసుకుంటున్న వాహనదారులపై పోలీసులు ఇక కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా వన్‌వే రోడ్లలో రాంగ్‌రూట్‌లో వెళ్లేవారిపై ఫోకస్ పెంచారు. బెంజ్ సర్కిల్, బందర్ రోడ్, ఎలూరు రోడ్, గవర్నర్‌పేట, రైల్వే స్టేషన్ ప్రాంతాలు, కనకదుర్గ వారధి మార్గాల్లో భారీగా ఉల్లంఘనలు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఫైన్లు వేసి వదిలేస్తున్న పోలీసులు.. ఇకపై పదేపదే నిబంధనలు అతిక్రమించే వారి వాహనాలను సీజ్ చేయాలని నిర్ణయించారు. నగరంలోని సీసీ కెమెరాల ద్వారా రాంగ్‌రూట్ డ్రైవింగ్‌ను గుర్తించడంతో పాటు ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహించనున్నారు. వన్‌వే ఉల్లంఘనలు ప్రాణాంతక ప్రమాదాలకు కారణమవుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.