దేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వాడుతున్న కాటన్ పేపర్ నోట్ల స్థానంలో పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టే అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ పరిశీలిస్తోంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించిన ప్రకారం, ఈ ప్రతిపాదనపై ఇంకా ప్రాథమిక స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి.

ప్లాస్టిక్ నోట్లు సాధారణ నోట్లలాగే కనిపించినా, అవి ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. తడిసినా, మురికి పట్టినా లేదా సులభంగా చిరిగిపోవు. ముఖ్యంగా నకిలీ నోట్ల తయారీని అడ్డుకునే అధునాతన భద్రతా ఫీచర్లను వీటిలో అమర్చవచ్చు.

ఇప్పటికే యూపీఐ లావాదేవీలు పెరిగినా నగదు వినియోగం తగ్గలేదు. ముఖ్యంగా రూ.10, రూ.20, రూ.50 వంటి చిన్న నోట్లకు భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో చిన్న నోట్లు త్వరగా పాడవకుండా ఉండేందుకు ప్లాస్టిక్ నోట్లు మంచి ప్రత్యామ్నాయంగా ఆర్బీఐ భావిస్తోంది.