‘దృశ్యం 2’ విడుదలకు ముందు తమకు కూడా ఎన్నో సందేహాలు ఉన్నాయని నటి తబు గుర్తుచేసుకున్నారు.
మోహన్‌లాల్ నటించిన మలయాళ ‘దృశ్యం 2’ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల ముందుకు రావడంతో, అదే కథను హిందీలో రీమేక్ చేస్తే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా? అనే ఆలోచన తమలో ఉండేదని ఆమె తెలిపారు.
“ఇప్పటికే అందరూ మలయాళ వెర్షన్ చూసేశారు.. మరి హిందీ సినిమా చూడటానికి ఎవరు వస్తారు?” అని అప్పట్లో తాను, తన స్నేహితులు అనుకున్నామని తబు చెప్పారు.
అయితే 2022లో విడుదలైన ‘దృశ్యం 2’ ఆ సందేహాలన్నింటినీ పటాపంచలు చేసింది. అజయ్ దేవగన్, తబు నటనతో పాటు కథ, సస్పెన్స్, ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది.
ఇప్పుడు ‘దృశ్యం’ ఫ్రాంచైజ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అజయ్ దేవగన్, తబు తమ పాత్రల్లో తిరిగి కనిపించనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఒకప్పుడు “ఎవరు చూస్తారు?” అనుకున్న సినిమా.. చివరకు బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.














