హీరో సూర్య, మమితా బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రబృందం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా హీరోయిన్ మమితా బైజు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు డైహార్డ్ ఫ్యాన్‌నని తెలిపింది. బన్నీ సినిమాలను రెగ్యులర్‌గా చూస్తుంటానని, ముఖ్యంగా ఆయన స్టైల్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. దీంతో మమితా బైజు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అల్లు అర్జున్ అభిమానులు ఈ వ్యాఖ్యలను తెగ షేర్ చేస్తున్నారు.
మరోవైపు, మానసిక ప్రశాంతత కోసం కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నట్లు మమితా బైజు వెల్లడించింది. తనకు సంబంధించిన ఏ విషయంలోనైనా తన అన్నయ్య నిర్ణయమే ఫైనల్ అని, ఆయన తీసుకునే నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పింది.












