నేషనల్ క్రష్ రష్మిక మందన్న కొత్త అవతార్‌లో నటిస్తున్న ‘మైసా’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన టీజర్‌కు భారీ స్పందన వస్తుండగా.. చిత్ర బృందం ప్రకారం అది 25 మిలియన్ ఆర్గానిక్ వ్యూస్ మార్క్‌ను దాటింది.
‘మైసా’లో రష్మిక ఇప్పటివరకు చూడని విధంగా ఒక గోండ్ గిరిజన మహిళ పాత్రలో కనిపించనున్నారు. టీజర్‌లో ఆమె పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. మట్టి, అడవులు, జలపాతాలు, అండర్‌వాటర్ యాక్షన్‌తో పాటు ప్రత్యర్థులతో హింసాత్మక పోరాట సన్నివేశాలు టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సినిమా కేవలం యాక్షన్‌కే పరిమితం కాకుండా ఎమోషన్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కథలో తండ్రీకూతుళ్ల అనుబంధం కూడా కీలకంగా ఉంటుందని సమాచారం.
డెబ్యూ దర్శకుడు రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని Unformula Films నిర్మిస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఈశ్వరి రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 27, 2026న థియేటర్లలో విడుదల కానుంది. టీజర్‌కు వస్తున్న స్పందనతో రష్మిక కొత్త యాక్షన్ అవతార్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.













