రణబలి సినిమాలోని ‘ఎందయ్యా సామి’ పూర్తి పాటను మేకర్స్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల మధ్య కెమిస్ట్రీని చూపించేలా ఈ పాటను రూపొందించారు. అజయ్–అతుల్ సంగీతం అందించగా, అజయ్ గోగవాలే, శ్వేతా మోహన్ పాటను ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.
తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఈ పాటను విడుదల చేశారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబలి చిత్రం అక్టోబర్ 16, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.













