నాని నటిస్తున్న ది ప్యారడైజ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందడిగా సాగింది. ఈ వేడుకలో నటుడు రాఘవ్ జుయల్, యాంకర్ సుమ కనకాల కలిసి ‘యేష నాగుల’ పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. రాఘవ్ తన ప్రత్యేకమైన డ్యాన్స్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోగా.. సుమ కూడా ఆయనతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.

వీరి డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దీంతో ఈ ఈవెంట్‌లో ‘యేష నాగుల’ పాటపై రాఘవ్, సుమ చేసిన డ్యాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. జంగిరెడ్డి, ప్రభ గానం చేశారు.