నేచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌కు గ్లోబల్ టచ్ వచ్చింది. ఈ చిత్రం నుంచి రెండో సింగిల్ ‘ఏష నాగుల’ పాటను అమెరికాలోని డల్లాస్‌లో గ్రాండ్‌గా విడుదల చేశారు.

డల్లాస్‌లోని Curtis Culwell Center వేదికగా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ నిర్వహించిన లైవ్ కాన్సర్ట్‌లో ‘ఏష నాగుల’ పాటను ఆవిష్కరించారు. అనిరుధ్ లైవ్‌గా పాటను విడుదల చేస్తున్న సమయంలో నాని అనూహ్యంగా స్టేజ్‌పైకి వచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.

నాని, అనిరుధ్ కలిసి స్టేజ్‌పై చేసిన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో వేదిక మొత్తం హోరెత్తిపోయింది. వేలాది మంది అభిమానులు కేరింతలు, చప్పట్లతో తమ అభిమాన హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌కు ఘన స్వాగతం పలికారు. నాని–అనిరుధ్ కాంబినేషన్‌లోని ఎనర్జీకి డల్లాస్ అభిమానులు ఫిదా అయ్యారు.

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని Maestro Productions, Seesharp Entertainment, Ultra Entertainments సంయుక్తంగా నిర్వహించగా, Bharat Bhavan అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది.

‘15 Years With You’ పేరుతో నిర్వహించిన ఈ లైవ్ కాన్సర్ట్ అనిరుధ్ సంగీత ప్రయాణంలోని 15 ఏళ్ల ప్రస్థానాన్ని సెలబ్రేట్ చేసేలా సాగింది. తన సంగీత ప్రయాణంలో తనతో పాటు నిలిచిన అభిమానులకు అనిరుధ్ ప్రత్యేక లైవ్ మ్యూజికల్ ట్రీట్ అందించారు.

మ్యూజిక్, లైవ్ పెర్ఫార్మెన్స్, అభిమానుల సందడి మధ్య ‘ఏష నాగుల’ సాంగ్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. నాని–అనిరుధ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.