ఎడిటర్


కర్ణాటకలో వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో మంత్రి నాగేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించిన నాగేంద్ర.. తన నిర్ణయానికి గల కారణాలను చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

నేపాల్‌లో వరదల కారణంగా చిక్కుకుపోయిన 21 మంది భారతీయులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారిగా కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వారిని మంత్రులు కలిశారు. అనంతరం వారిని స్వస్థలాలకు పంపించినట్లు అధికారులు తెలిపారు.

డల్లాస్‌లోని మెక్‌కిన్నీలో కృష్ణ హెరిటేజ్ సెంటర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీకృష్ణుడి దివ్య అవతరణను పురస్కరించుకుని సెప్టెంబర్ 4, 2026 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.

అమెరికాలోని డల్లాస్‌లో Dallas Area Rayalaseema Association (DARA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న Annual Picnic 2026కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహ్లాదకరమైన వినోదాన్ని ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ వేడుక కోసం తెలుగు కమ్యూనిటీ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మిచిగన్‌లోని శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక 5K వాక్ ఘనంగా జరిగింది. కంటి ఆరోగ్యం, దృష్టి సంరక్షణపై అవగాహన పెంచడంతో పాటు.. అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు శంకర నేత్రాలయ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మద్దతు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.

నేపాల్‌లో సంభవించిన భారీ వరదలు, ఆకస్మిక వరదలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. విపత్తు నేపథ్యంలో నేపాల్‌కు అవసరమైన సహాయం అందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపారు. వరదల్లో దాదాపు 90 మంది అమెరికా పౌరులు గల్లంతైనట్లు వెల్లడించారు. వారి ఆచూకీ కోసం అమెరికా అధికారులు చర్యలు ప్రారంభించారని చెప్పారు.

8 ఏళ్ల తెలుగమ్మాయి సరయు తలపనేని అంతర్జాతీయ చెస్ వేదికపై సత్తా చాటింది. కొలంబియాలోని మెడెలిన్‌లో జరిగిన పాన్ అమెరికన్ యూత్ చెస్ చాంపియన్‌షిప్ అండర్-8 బాలికల క్లాసికల్ విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణ పతకం సాధించింది.

ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) హఠాన్మరణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నారాయణరావు పార్థివదేహానికి నివాళులర్పించిన చిరంజీవి.. దాదాపు ఐదు దశాబ్దాల స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.

‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’.. విజయనగర సామ్రాజ్యాన్ని ఏలిన శ్రీకృష్ణదేవరాయలు అన్న ఈ మాట తెలుగు భాష గొప్పతనానికి నిదర్శనం. ఇక ‘‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా.. గతమెంతో ఘనకీర్తి గలవాడా’’ అంటూ వేములపల్లి రచించిన గీతం వినిపించిన ప్రతిసారీ ప్రతి తెలుగువాడి గుండె ఉప్పొంగుతుంది.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంతటి ఘన చరిత్ర, సాహిత్య సంపద, సంస్కృతి కలిగిన భాష తెలుగు.

నేపాల్‌లో భారీ విధ్వంసానికి కారణమైన హిమనదీ సరస్సు విరిగిపడిన ప్రాంతానికి చైనా హెలికాప్టర్ చేరుకుంది. హిమనదీ సరస్సు కట్ట ఒక్కసారిగా తెగిపడి భారీగా నీరు, మంచు, మట్టి, రాళ్లు దిగువ ప్రాంతాలకు ఉధృతంగా ప్రవహించే ఈ ఘటనను గ్లేషియల్ లేక్ ఔట్‌బస్ట్ ఫ్లడ్ (GLOF) అంటారు.
