అమెరికాలోని డల్లాస్‌లో Dallas Area Rayalaseema Association (DARA) ఆధ్వర్యంలో నిర్వహించనున్న Annual Picnic 2026కు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాయలసీమ సంస్కృతి, సంప్రదాయాలు, ఆహ్లాదకరమైన వినోదాన్ని ఒకే వేదికపైకి తీసుకురానున్న ఈ వేడుక కోసం తెలుగు కమ్యూనిటీ సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
పిక్నిక్‌లో రాయలసీమ సంప్రదాయ వంటకాలు, మ్యూజికల్ ప్రోగ్రామ్స్, డ్యాన్స్ కార్యక్రమాలు, ఫన్ గేమ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. చిన్నారుల కోసం ప్రత్యేక వినోద కార్యక్రమాలతో పాటు వెండర్ బూత్స్, ఛారిటీ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.
డల్లాస్‌లోని రాయలసీమ కమ్యూనిటీ సభ్యులను ఒక్కచోట చేర్చి.. తమ సంస్కృతి, సంప్రదాయాలను పంచుకుంటూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడిపేలా ఈ పిక్నిక్‌ను నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని DARA అధ్యక్షుడు వీర శివారెడ్డి లేవక, ప్రెసిడెంట్-ఎలెక్ట్ గౌతమ్ కాశిరెడ్డి, మాజీ అధ్యక్షుడు గౌతమ్ మియాపురం, కార్యదర్శి మహేంద్ర పద్మరాజు, కోశాధికారి శ్రీని అన్నారెడ్డి, జాయింట్ ట్రెజరర్లు గురు మల్లెల, అవినాష్ వెల్లంపాటి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యులు అమర్ కలకడ, శ్రీధర్ భూమిరెడ్డి, స్వాతి సన్నపురెడ్డి, నిహారిక లోమడ, సరిత సింగం, మంజుల కొండ, నాగేశ్వర్ అల్లగడ్డ, రమేష్ రెడ్డి దండెల, మల్లికార్జున రెడ్డి బత్తుల, ఇమ్రాన్ బాషా, చంద్రకాంత్ రెడ్డి కర్నాటి, విద్యాసాగర్ పల్లా తదితరులు ఏర్పాట్లలో భాగస్వాములవుతున్నారు.
అడ్వైజరీ, స్టీరింగ్ కమిటీ సభ్యులు రమణ పుట్లూరి, చంద్ర పొట్టిపాటి, రఘునాథ కమ్మెత, హరి సింగం, లోకేష్ నాయుడు, ఇస్మాయిల్ పెనుకొండ, అనూప్ దేవిరెడ్డి, భాస్కర్ గరిడికోట, సునీల్ దేవిరెడ్డి, జయచంద్ర గజ్జులపల్లి, మధు మల్లు, మల్లికార్జున మురారి, ప్రేమ్ గంగులకుంట, సతీష్ బొమ్మినేని మార్గదర్శకత్వం అందిస్తున్నారు.
రాయలసీమ రుచులు.. సంగీతం.. ఆటలు.. డ్యాన్స్.. పిల్లల వినోదం.. కమ్యూనిటీ కార్యక్రమాలతో అక్టోబర్ 4న DARA Annual Picnic 2026 డల్లాస్‌లో సందడిగా సాగనుంది.
తేదీ: అక్టోబర్ 4, ఆదివారం
సమయం: ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
వేదిక: HMR Grand, 1072 W Sherman Dr, Aubrey, TX 76227













