డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని అమెరికాలోని ఫిలడెల్ఫియాలో YSR Foundation USA ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు.సెప్టెంబర్ 12, 2026 శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. King of Prussiaలోని Valley Forge Casino Resort వేదికగా అమెరికన్ రెడ్‌క్రాస్ సహకారంతో ఈ బ్లడ్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారు.

దివంగత వైఎస్సార్ 17వ వర్ధంతితో పాటు, 9/11 విషాద ఘటన 25వ వార్షికోత్సవం సందర్భంగా మృతులకు నివాళిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

రక్తదానం చేయాలనుకునే వారు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. డా. రాఘవ రెడ్డి గోసల ఈ బ్లడ్ డ్రైవ్‌కు కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రక్తదాతలు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (Valid ID) తీసుకురావాలని అమెరికన్ రెడ్‌క్రాస్ సూచించింది.

WhatsApp Image 2026-08-28 at 11.47.21 PM.jpeg