ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గార్గ్ ఏవియేషన్‌కు చెందిన టెక్నామ్ ట్రైనింగ్ విమానం కుప్పకూలడంతో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. గంగా బ్యారేజీ సమీపంలోని నతాపుర్వా గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

టేకాఫ్ అయిన సుమారు 20 నిమిషాలకే విమానం నేలకూలినట్లు సమాచారం. ప్రమాదంలో ఇన్‌స్ట్రక్టర్ సచిన్ భాటియా, ట్రైనీ పైలట్ అభిషేక్ పూజారి మృతి చెందారు. సచిన్ భాటియా గుజరాత్‌కు చెందినవారు కాగా, అభిషేక్ పూజారి కర్ణాటకకు చెందినవారు.

ఇన్‌స్ట్రక్టర్ సచిన్ భాటియాకు సుమారు 3,000 గంటల ఫ్లయింగ్ అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన VT-NBV రిజిస్ట్రేషన్‌ ఉన్న ఇదే విమానం గత జూన్‌లో కాన్పూర్‌లోని చకేరి ఎయిర్‌పోర్ట్‌లోనూ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.