మిచిగన్‌లోని శంకర నేత్రాలయ డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక 5K వాక్ ఘనంగా జరిగింది. కంటి ఆరోగ్యం, దృష్టి సంరక్షణపై అవగాహన పెంచడంతో పాటు.. అవసరమైన వారికి నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించేందుకు శంకర నేత్రాలయ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు మద్దతు కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశంగా నిలిచింది.
ఈ వాక్‌లో కమ్యూనిటీ సభ్యులు, కుటుంబాలు, చిన్నారులు, వాలంటీర్లు, స్పాన్సర్లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కేవలం 5K వాక్‌గా కాకుండా.. శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతపై భారతీయ-అమెరికన్ కమ్యూనిటీలో అవగాహన పెంచే వేదికగా నిలిచింది.
కార్యక్రమం విజయవంతం కావడంలో డెట్రాయిట్ చాప్టర్ బృందం కీలక పాత్ర పోషించింది. ప్రతిమ కొడాలి, రమణ ముదిగంటి, విజయ్ పెరుమాళ్ళ, రవి కవుతరపు, వెంకట్ గోటూర్, త్రిపుర సుందరి భాగవతుల సమన్వయంతో పాటు.. వాలంటీర్లు సాయి గోపిసెట్టి, శిరీషా ఉప్పలపాటి, రజని బేతిన, అనిత బొమ్మనవేని చేసిన కృషిని నిర్వాహకులు అభినందించారు.
విజేతలకు మెడల్స్ అందజేయడంతో పాటు.. కార్యక్రమం విజయానికి సహకరించిన వాలంటీర్లు, స్పాన్సర్లను సత్కరించారు. శంకర నేత్రాలయ అందిస్తున్న ఉచిత, సేవా ఆధారిత నేత్ర వైద్య కార్యక్రమాలపై కూడా ఈ సందర్భంగా అవగాహన కల్పించారు.
పాల్గొనడం, వాలంటీర్‌గా సేవ చేయడం, స్పాన్సర్ చేయడం లేదా విరాళం అందించడం.. ప్రతి చిన్న సహకారం ఒకరి జీవితంలో వెలుగును నింపగలదని నిర్వాహకులు సందేశమిచ్చారు.
ఈ కార్యక్రమానికి అధ్యక్షులు బాల రెడ్డి ఇందుర్తి మరియు నాయకత్వ బృందం అందించిన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలిచాయి. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ డెట్రాయిట్ చాప్టర్ కృతజ్ఞతలు తెలిపింది.


















