నేపాల్‌లో భారీ విధ్వంసానికి కారణమైన హిమనదీ సరస్సు విరిగిపడిన ప్రాంతానికి చైనా హెలికాప్టర్ చేరుకుంది. హిమనదీ సరస్సు కట్ట ఒక్కసారిగా తెగిపడి భారీగా నీరు, మంచు, మట్టి, రాళ్లు దిగువ ప్రాంతాలకు ఉధృతంగా ప్రవహించే ఈ ఘటనను గ్లేషియల్ లేక్ ఔట్‌బస్ట్ ఫ్లడ్ (GLOF) అంటారు.
హిమనదీతో అడ్డుకట్టబడిన సరస్సులో నీటి ఒత్తిడి పెరగడం, హిమనదిలో పగుళ్లు ఏర్పడటం వల్ల నీరు బయటకు వెళ్లేందుకు మార్గం ఏర్పడుతుంది. దీంతో సరస్సులో నిల్వ ఉన్న భారీ నీటి పరిమాణం, దానితో పాటు మట్టి, రాళ్లు అత్యంత వేగంతో పర్వతాల నుంచి దిగువకు దూసుకొస్తాయి.
ఇలాంటి GLOF ఘటనలు క్షణాల్లోనే భారీ వరదలకు దారితీసి.. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. నేపాల్‌లో తాజాగా జరిగిన విధ్వంసానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు.









