నేపాల్‌ను భీకర వరదలు ముంచెత్తిన వేళ.. భారత్‌ భారీ మానవీయ సాయంతో అండగా నిలిచింది.“ఎల్లప్పుడూ నేపాల్‌ వెంటే ఉంటాం” అంటూ.. వరద బాధితులకు తక్షణ ఉపశమనం అందించేందుకు భారత్‌ సహాయక సామగ్రిని తరలిస్తోంది.

ఇప్పటికే 10 టన్నుల సహాయ సామగ్రి తొలి విడతగా నేపాల్‌కు చేరుకుంది. భారత రాయబారి నవీన్‌ శ్రీవాస్తవ ఈ సామగ్రిని నేపాల్‌ మంత్రి ఖడక్‌ రాజ్‌ పౌడెల్‌కు అందజేశారు.

మరోవైపు.. భారత్‌ సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది. 37.5 టన్నుల HADR సామగ్రి, అత్యవసర మందులు, ప్రాణరక్షణ ఔషధాలు, ఆహార ప్యాకెట్లతో రెండో ప్రత్యేక విమానం నేపాల్‌కు బయలుదేరింది.

వేలాది మంది వరద బాధితులకు ఈ సాయం తక్షణ ఉపశమనంగా నిలవనుంది.

నేపాల్‌కు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు భారత్‌ పూర్తిగా కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.ఆపదలో మిత్రదేశానికి అండగా.. భారత్‌ మరోసారి తన మానవీయతను చాటుకుంది!