తెలంగాణ అమెరికా తెలుగు సంఘం-TTA ఆధ్వర్యంలో జూలై 17 నుండి 19 వరకు నార్త్ కరోలినాలోని షార్లెట్ కన్వెన్షన్ సెంటర్‌లో టీటీఏ మెగా కన్వెన్షన్ 2026 ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మహాసభల సందర్భంగా విడుదల చేయనున్న టీటీఏ సోవనీర్ 2026 కోసం ప్రత్యేక సాహిత్య పోటీలను నిర్వహిస్తున్నట్లు సోవనీర్ అండ్ లిటరరీ కమిటీ వెల్లడించింది.

ఈ పోటీల్లో భాగంగా తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో రచనలు ఆహ్వానిస్తున్నారు. కథలు, వ్యాసాలు, కవితలు/పద్యాలు అనే మూడు విభాగాల్లో రచనలు పంపవచ్చు. కథలు గరిష్టంగా రెండు పేజీలు, వ్యాసాలు మూడు పేజీలు, కవితలు 20 నుండి 40 పంక్తుల మధ్య ఉండాలి.

ప్రతి విభాగంలో విజేతలకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. ప్రథమ బహుమతి $200, ద్వితీయ బహుమతి $100, తృతీయ బహుమతి $50గా నిర్ణయించారు.

రచనలు పూర్తిగా స్వంతమైనవి కావాలి మరియు గతంలో ఎక్కడా ప్రచురితం కాలేదు. ఎంపికైన ఉత్తమ రచనలను టీటీఏ సోవనీర్‌తో పాటు సంస్థ త్రైమాసిక పత్రికలో ప్రచురిస్తారు. జోక్స్, కార్టూన్లు, ఇతర కళాఖండాలను కూడా స్వాగతిస్తున్నారు.

ఆసక్తి ఉన్నవారు తమ రచనలను మే 20, 2026లోపు అధికారిక వెబ్‌సైట్ ttaconvention.org/souvenir ద్వారా సమర్పించాలని నిర్వాహకులు సూచించారు.

tta sovienir.jpeg