అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. జిల్లా కేంద్రం అనంతపురం. 2022 లో ఈ జిల్లాను విభజించి కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితం. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిరప, అరటి, నువ్వులు, చెరుకు, పట్టు. ఇక్కడి ముఖ్యమైన పరిశ్రమలలో సున్నపురాయి, ఇనుము, వజ్రాల త్రవ్వకం, ఆటోమొబైల్ ఉన్నాయి.







