అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, రాయలసీమ ప్రాంతంలో గల జిల్లా. దీని ముఖ్యపట్టణం మదనపల్లె , జిల్లాలో అతిపెద్ద నగరం. జిల్లాలోని తాళ్లపాకకు చెందిన ప్రముఖ సంకీర్తనకారుడైన అన్నమాచార్య పేరు జిల్లాకు పెట్టారు. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో జిల్లాలోని సురభి గ్రామంలో మొదలయ్యింది. ఆంధ్రా ఊటీగా పేరొందిన హార్సిలీ హిల్స్ ఈ జిల్లాలోనిదే.







