ముఖం ఎంత మెరిసినా చేతులే నిజమైన వయసును బయటపెడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేతులపై చర్మం పలుచగా ఉండటం, ఆయిల్ గ్రంథులు తక్కువగా ఉండటం, ఎండకు ఎక్కువగా గురికావడం వల్ల ముడతలు, మచ్చలు త్వరగా కనిపిస్తాయి. తరచూ చేతులు కడుక్కోవడం, UV కిరణాల ప్రభావంతో డ్రైనెస్ పెరిగి చేతులు వయసు మించినట్టుగా కనిపిస్తాయి.

కొల్లాజెన్ తగ్గిపోవడంతో చేతులు బోనిగా మారడం, నరాలు స్పష్టంగా కనిపించడం కూడా సాధారణమే. అందుకే చేతులకు మాయిశ్చరైజర్ వాడటం, బయటికి వెళ్లే ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయడం, గ్లోవ్స్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం హ్యాండ్ రీజువెనేషన్ ట్రీట్‌మెంట్స్ కూడా అందుబాటులోకి వచ్చాయని చెబుతున్నారు.