AI చిప్ స్టార్టప్ Etched మరో భారీ పెట్టుబడిని దక్కించుకుంది. ప్రముఖ క్వాంట్ ట్రేడింగ్ సంస్థ Jane Street నేతృత్వంలో తాజాగా 700 మిలియన్ డాలర్లు సమీకరించింది. దీంతో కంపెనీ విలువ ఏకంగా 21 బిలియన్ డాలర్లకు చేరింది.
గత డిసెంబర్‌లో Etched విలువ 5 బిలియన్ డాలర్లు కాగా.. జూలైలో 300 మిలియన్ డాలర్ల Series C రౌండ్‌లో 10.3 బిలియన్ డాలర్లకు చేరింది. ఇప్పుడు కేవలం నెల రోజుల్లోనే కంపెనీ విలువ దాదాపు రెట్టింపైంది.
AI inference వేగాన్ని పెంచేందుకు Etched రెండు కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసింది. ఒకటి తక్కువ వోల్టేజ్‌తో పనిచేసే prefill chip కాగా.. మరొకటి పలు చిప్‌లను ఒకే మెమరీ పూల్‌కు అత్యంత వేగంగా కనెక్ట్ చేసే cluster-scale memory.
Etched ప్రకారం.. ఈ టెక్నాలజీ AI మోడళ్లను వేగంగా నడిపించడంతో పాటు ఖర్చులను కూడా తగ్గిస్తుంది. Jane Street ఇప్పటికే Etched చిప్‌ను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. తమ డేటా సెంటర్‌లో Etched సిస్టమ్‌తో కూడిన ర్యాక్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
ఈ రౌండ్‌లో Kleiner Perkins, Sequoia Capital, Andreessen Horowitz, Peter Thiel, Tiger Global, Blackstone తదితర ప్రముఖ ఇన్వెస్టర్లు కూడా పాల్గొన్నారు.









