అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి అధికారిక భారత పర్యటనలో భాగంగా శనివారం ప్రధాని మోదీను ఢిల్లీలో కలిశారు. గత ఏడాది మధ్య నుంచి కొన్ని సవాళ్లు ఎదుర్కొంటున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు.
భేటీ అనంతరం ప్రధాని మోదీ ఎక్స్‌లో స్పందిస్తూ, “మార్కో రూబియోను కలవడం ఆనందంగా ఉంది. భారత్-అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో కొనసాగుతున్న పురోగతి, అలాగే ప్రాంతీయ మరియు ప్రపంచ శాంతి, భద్రత అంశాలపై చర్చించాం. ప్రపంచ మేలుకోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తూనే ఉంటాయి” అని పేర్కొన్నారు.
ఇక శనివారం ఉదయం కోల్‌కతాకు చేరుకున్న రూబియో, మదర్ హౌస్‌లోని Missionaries of Charity ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన ఢిల్లీకి బయల్దేరారు. “భారత్‌కు చేరుకున్నాను. అద్భుతమైన పర్యటన కోసం ఎదురుచూస్తున్నాను” అని రూబియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు.












