నేపాల్‌లో చోటుచేసుకున్న విపత్కర పరిస్థితుల మధ్య ఓ చిన్నారి చూపించిన బాధ్యత అందరి హృదయాలను కదిలిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ బాలుడు తన చిన్న చెల్లిని ఎత్తుకుని, ఆమెను జాగ్రత్తగా చూసుకుంటూ కనిపించాడు.

విపత్తుతో ప్రభావితమైన ప్రాంతంలో భయాందోళనల మధ్య ఇద్దరూ ముందుకు సాగుతుండగా.. తన చెల్లికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆ బాలుడు కాపాడుతున్న దృశ్యాలు హృదయాలను కలిచివేస్తున్నాయి. అదే సమయంలో తమ తల్లిదండ్రుల కోసం వెతుకుతున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.

కన్నవాళ్లకు దూరమైన ఆ చిన్నారుల పరిస్థితి చూసి నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ అన్నాచెల్లెళ్లు క్షేమంగా తమ తల్లిదండ్రులను కలవాలని పలువురు ప్రార్థిస్తున్నారు. చిన్న వయసులోనే తన చెల్లికి బాధ్యతగా నిలిచిన ఆ బాలుడి దృశ్యాలు.. విపత్తు వేళ కుటుంబాల భయాన్ని, అనిశ్చితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.