అమెరికాలోని New York City మేయర్ Zohran Mamdani వార్షిక ఇజ్రాయెల్ డే పరేడ్‌కు హాజరుకాకపోవడం వివాదానికి దారితీసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ సంప్రదాయాన్ని ఆయన విరమించడంతో యూదు వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

మే 31న జరిగిన ఈ పరేడ్‌లో గతంలో మేయర్లు, గవర్నర్లు సహా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు పాల్గొనడం ఆనవాయితీగా ఉండేది. అయితే పాలస్తీనా హక్కులకు తన మద్దతు కారణంగా తాను పరేడ్‌కు హాజరుకానని మమ్దానీ ముందుగానే ప్రకటించారు.