టిప్స్‌పై ఆధారపడి జీవించే లక్షలాది మంది ఉద్యోగులకు భారీ ఊరట లభించనుంది. ఇకపై లాస్ వెగాస్ మాత్రమే కాదు... అమెరికాలో ఎక్కడ పనిచేసినా టిప్ ఇన్‌కమ్‌పై జీరో ట్యాక్స్ ప్రయోజనం అందుబాటులోకి రానుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వర్కింగ్ ఫ్యామిలీస్ ట్యాక్స్ కట్స్లో భాగంగా ఈ కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, క్యాసినోలు, సర్వీస్ రంగాల్లో టిప్స్ పొందే ఉద్యోగులు తమ టిప్ ఆదాయంపై ఫెడరల్ పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.

ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగుల చేతికి వచ్చే నికర ఆదాయం పెరగనుంది. ముఖ్యంగా లాస్ వెగాస్, న్యూయార్క్, మయామి, ఆర్లాండో వంటి టూరిజం నగరాల్లో పనిచేసే వారికి ఇది పెద్ద ఊరటగా మారనుంది.

కష్టపడి సంపాదించిన టిప్స్... ఇక పూర్తిగా మీవే! అంటూ ట్రంప్ ప్రకటించిన ఈ నిర్ణయం అమెరికా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.