అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌తో శాంతి ఒప్పందంపై కీలక నిర్ణయం తీసుకునేందుకు వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో సమావేశమవుతున్నట్లు ప్రకటించారు. హోర్ముజ్ జలసంధిని వెంటనే తెరవాలని, ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు తయారు చేయబోదని హామీ ఇవ్వాలని ట్రంప్ డిమాండ్ చేశారు. అలాగే ఇరాన్ పోర్టులపై అమెరికా నౌకాదళ నిర్బంధాన్ని ఎత్తివేస్తామని పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్‌లోని యురేనియం నిల్వలను అమెరికా, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సమక్షంలో ధ్వంసం చేస్తామని ట్రంప్ తెలిపారు. యుద్ధ విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించే ఒప్పందంపై చర్చలు పూర్తయ్యాయని అమెరికా అధికారులు వెల్లడించారు.














