బెడ్రూమ్లో భార్య.. బాత్రూమ్లో భర్త ఆత్మహత్య.. ఆ దంపతులకు వచ్చిన కష్టమేంటంటే?

బాపట్లజిల్లా వేటపాలెం మండలం రావురిపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదాల నేపథ్యంలో భార్యాభర్తలు ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















