మన వంటకాల్లో కొత్తిమీర ఇచ్చే సువాసన, రుచే వేరు. కూరగాయల రుచిని పెంచాలన్నా, చట్నీలు రుచికరంగా మారాలన్నా కొత్తిమీర ఆకులు ఉండాల్సిందే. అయితే వర్షాకాలంలో మార్కెట్‌లో కొత్తిమీర ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. అంతేకాకుండా బజార్లో దొరికే కొత్తిమీరలో పురుగుమందుల ఘాటు ఎక్కువ. ఈ సమస్యలకు చెక్ పెడుతూ, మన ఇంటి ప్రాంగణంలోనే రూపాయి ఖర్చు లేకుండా, పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో పచ్చి కొత్తిమీరను కేవలం 3 నుండి 5 రోజుల్లో ఎలా మొలకెత్తించవచ్చో తెలుసుకుందాం..