నిరంతరం కళ్లద్దాలు ధరించడం వల్ల ముక్కుకు ఇరువైపులా నల్లటి మచ్చలు లేదా గుర్తులు పడటం సర్వసాధారణం. ఇవి ముఖం అందాన్ని దెబ్బతీస్తాయి. అయితే, రసాయన క్రీములు వాడకుండా వంటింటి చిట్కాలతో కేవలం 5 రోజుల్లో ఈ మచ్చలను వదిలించుకోవచ్చునని మీకు తెలుసా..? ఇందుకోసం ఇంట్లో లభించే సాధారణ పదార్థాలు ఉంటే సరిపోతుంది. ఈ సహజసిద్ధమైన పద్ధతులు చర్మానికి పోషణను అందించి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మచ్చలను పూర్తిగా నివారిస్తాయి.