ల్యాండింగ్ సమయంలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన భారత వాయుసేన AN-32 విమానం
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

అస్సాంలోని జోర్హాట్ వైమానిక స్థావరంలో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం కూలిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. శనివారం (జూన్ 13) ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విమానం నియంత్రణ కోల్పోయి ఎయిర్‌ఫీల్డ్ పరిధిలోనే కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపులోకి తీసుకొచ్చినప్పటికీ, విమానంలో ఉన్న సిబ్బంది పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











