సోషల్ మీడియా నోటిఫికేషన్లు, నిరంతర స్క్రీన్ టైమ్‌తో డిజిటల్ అలసటకు గురవుతున్నారా? అయితే మీ కోసం ఒక శుభవార్త! పాతకాలపు నోకియా ఫ్లిప్ ఫోన్‌లను గుర్తుచేసే డిజైన్‌తో ‘కమోడోర్ కాల్‌బ్యాక్ 8020’ మార్కెట్లోకి వచ్చింది. అవసరమైన యాప్‌లు మాత్రమే వాడుకుంటూ, స్మార్ట్‌ఫోన్ వ్యసనం నుంచి బయటపడటానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఆధునిక ఫీచర్లు, రెట్రో లుక్‌తో వచ్చిన ఈ కొత్త ఫోన్ ప్రత్యేకతలేమిటో తెలుసుకుందాం!