నెల రోజులుగా పదో తరగతి విద్యార్ధులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న ఆ సమయం రానేవచ్చింది. ఈ రోజే పబ్లిక్ పరీక్షల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది..