Nitish Rana 28 Runs in One Over: ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గత కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమై విమర్శలు ఎదుర్కొన్న రాణా, పంజాబ్ కింగ్స్‌పై తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. కేవలం ఒకే ఓవర్‌లో ఏకంగా 28 పరుగులు పిండుకుని, లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా పరుగులు సాధించిన దిగ్గజ ఆటగాళ్ల సరసన నిలిచి రికార్డు సృష్టించాడు.