పారిస్: ప్రతిష్ఠాత్మకమైన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ప్రైజ్‌మనీ వివాదం సమస్యగా మారింది. టెన్నిస్ గ్రాండ్‌స్లామ్‌ల ఆదాయంలో క్రీడాకారులకు ఇచ్చే వాటను పెంచకపోతే తాము టోర్నీని బహిష్కరించేందుక వెనుకాడబోమని అగ్రశ్రేణి ఆటగాళ్లు అరిన సబలెంక, కొకొ గాఫ్, సియాటెక్, సినర్, జ్వరేవ్ తదితరులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ప్రొఫెషనల్స్ టెన్నిస్ ప్లేయర్స్ అసోసియేషన్ స్పందించింది. ఆటగాళ్ల డిమాండ్‌కు మద్దతుగా నిలిచింది.

గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు ఆటగాళ్లే ప్రధాన ఆకర్షణ అని స్పష్టం చేసింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల ద్వారా లభించే ఆదాయంలో క్రీడాకారులకు ఇచ్చే వాటాను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఒక వేళ నిర్వాహకులు ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోక పోతే స్టార్ ఆటగాళ్లు ఈ పోటీలకు దూరంగా ఉన్నా ఆశ్చర్యం లేదని అసోసియేషన్ హెచ్చరించింది.