జెన్ జీ యువత అప్పులు తీసుకునే విధానంలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. అవసరాల కోసం కాకుండా ట్రావెల్, కాన్సర్ట్స్, ప్రత్యేక అనుభవాల కోసం పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు. అయితే తమ మ్యూచువల్ ఫండ్స్, షేర్లు వంటి పెట్టుబడులను మాత్రం విక్రయించడం లేదు. పెట్టుబడులపై కాంపౌండింగ్ లాభాలు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను దృష్టిలో పెట్టుకుని, స్వల్పకాలిక రుణాలను ఉపయోగిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. క్రిఫ్ హైమార్క్ గణాంకాల ప్రకారం జెన్ జీ వినియోగ రుణాలు ఏడాదిలో దాదాపు 24 శాతం పెరిగాయి