బెంగళూరు నగరంలో అక్రమంగా నివసిస్తున్నట్లు అనుమానిస్తున్న 31 మంది బంగ్లాదేశీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
10 పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వీరిని గుర్తించారు.
పోలీసుల ఎస్కార్ట్‌తో SMVT బెంగళూరు నుంచి 20 మంది పోలీసు సిబ్బంది వీరిని పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాకు తరలిస్తున్నారు.
అక్కడి నుంచి నిబంధనల ప్రకారం బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేసే ప్రక్రియ చేపట్టనున్నారు.
అక్రమ వలసదారులపై ఫోకస్ పెంచిన బెంగళూరు పోలీసులు ‘ఆపరేషన్ ముక్త’ చేపట్టారు.
ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.












