అయ్యో.. ఇంతటి దారుణమా? ఓ వృద్ధురాలిని అత్యంత అమానుషంగా లాక్కెళ్లి, దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నడవడానికి కూడా కష్టంగా ఉన్న వృద్ధురాలిపై ఇంతటి కర్కశత్వానికి పాల్పడటంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
“బలహీనంగా, అసహాయంగా ఉన్న వృద్ధురాలిపై ఇలాంటి దాడి చేయడం దారుణం. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలి” అంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు స్పందించి, వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వృద్ధురాలికి న్యాయం చేయాలని, నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి.









