కొన్ని దృశ్యాలు కళ్ల ముందు నుంచి వెళ్లిపోయినా.. మనసులో మాత్రం చాలా సేపు నిలిచిపోతాయి. అలాంటి ఓ హృదయాన్ని హత్తుకునే వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైన గోవులకు సంబంధించిన ఈ వీడియో నెటిజన్లను కదిలిస్తోంది.
వీడియోలో ఓ చిన్న దూడ.. పాల వ్యాన్‌పై ఏర్పాటు చేసిన త్రీడీ గోవు బొమ్మను తన తల్లిగా భావించి దాని దగ్గరకు వెళ్తుంది. తల్లి కనిపించిందన్న ఆనందంతో బొమ్మ చుట్టూ తిరుగుతూ.. అమాయకంగా పాలు తాగేందుకు ప్రయత్నిస్తుంది.
అది బొమ్మ మాత్రమేనని తెలియని ఆ చిన్న దూడ.. తన తల్లి తనకు పాలు ఇస్తుందేమోనని ఎదురుచూస్తూ చేసిన ప్రయత్నం చూపరుల హృదయాలను బరువెక్కిస్తోంది.












