దమన్‌లో సముద్ర తీరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సముద్రంలో స్నానం చేస్తుండగా ఓ ఏడేళ్ల బాలిక ప్రమాదవశాత్తూ లోతైన నీటిలోకి వెళ్లి మునిగిపోయింది. నీటిలో కొట్టుమిట్టాడుతున్న బాలికను గమనించిన లైఫ్‌గార్డ్ సుజల్ మాంగేలే ఏమాత్రం ఆలస్యం చేయలేదు.
వెంటనే సముద్రంలోకి దూకి బాలిక వద్దకు చేరుకున్నాడు. చాకచక్యంగా ఆమెను పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు తీసుకొచ్చాడు. సుజల్ సమయస్ఫూర్తితో స్పందించడంతో బాలిక ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ప్రమాదాన్ని గమనించిన వెంటనే క్షణాల్లో స్పందించి చిన్నారి ప్రాణాలను కాపాడిన సుజల్ మాంగేలే ధైర్యసాహసాలకు స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన మరోసారి సముద్రంలో అప్రమత్తత, లైఫ్‌గార్డుల ప్రాధాన్యతను గుర్తుచేసింది.












