భారత్ ప్రపంచంలో ఐదో అతిపెద్ద డిజిటలైజ్డ్ ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా AI పనితీరులో ప్రపంచంలో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. ఈ విషయాన్ని ICRIER-Prosus Centre for Internet and Digital Economy విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.
AI రంగంలో భారత్ జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే, కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాలను వెనక్కి నెట్టింది. ప్రపంచ AI వినియోగదారుల్లో 72 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందినవారేనని నివేదిక తెలిపింది. భారత్, చైనా కలిసి ప్రపంచ AI వినియోగంలో దాదాపు రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి.
డిజిటల్ సేవల ద్వారా భారత్ 328 బిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని నమోదు చేసింది. అలాగే ప్రపంచంలో రెండో అతిపెద్ద AI టాలెంట్ పూల్ భారత్‌కే చెందింది. అమెరికా, చైనా, సింగపూర్‌ల తర్వాత AI ఇండెక్స్‌లో భారత్ నాలుగో స్థానంలో నిలవడం దేశ డిజిటల్ శక్తిని మరోసారి చాటిందని నిపుణులు పేర్కొంటున్నారు.











