అమెరికాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వ్యాపార, వృత్తి, కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేసే దిశగా కీలక ముందడుగు పడింది. Andhra Pradesh American Association (AAA), Andhra Pradesh Business Community (ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ఐదుగురు రీజినల్ డైరెక్టర్లను ప్రకటించాయి. ఉత్తర అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో AAA, ABC కార్యక్రమాలను విస్తరించడంతో పాటు వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, యువ నాయకత్వాన్ని ఒకే వేదికపైకి తీసుకురావడంలో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.
ఐదుగురు రీజినల్ డైరెక్టర్లకు కీలక బాధ్యతలు
2028 జనవరి 1 నుంచి 2031 డిసెంబర్ 31 వరకు కొనసాగనున్న ఈ పదవీకాలంలో.. ప్రతి రీజినల్ డైరెక్టర్‌కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ AAA–ABC నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయడం వీరి ప్రధాన లక్ష్యం.
బొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్)
లాస్‌వేగాస్‌లో తెలుగు సమాజంలో చురుకుగా పనిచేస్తున్న బొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్‌గా సేవలందిస్తున్నారు. మెంటరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యాపార అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
బాధ్యతలు: నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా.
హనుమంతు సింహబలుడు (సింహ)
మీడియా రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న హనుమంతు సింహబలుడు (సింహ) ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్‌గా, గతంలో USI TV న్యూస్ డైరెక్టర్‌గా పనిచేశారు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇస్తూ తన ప్రాంతీయ బాధ్యతలను నిర్వర్తించనున్నారు.
బాధ్యతలు: న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ.
దొమ్మరాజు హేమంత్ వర్మ
టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అనుభవం ఉన్న దొమ్మరాజు హేమంత్ వర్మ ERP & Automations డైరెక్టర్‌గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యాపార భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
బాధ్యతలు: పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఓహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా.
గొట్టిపాటి కళ్యాణ్
18 సంవత్సరాలకు పైగా ఎంటర్‌ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్‌గా అనుభవం ఉన్న గొట్టిపాటి కళ్యాణ్ ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్ రంగాల్లో పనిచేశారు. వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి MBA పూర్తి చేసిన ఆయన.. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, తెలుగు సమాజ సేవకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
బాధ్యతలు: అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో.
చౌటకూరి చేతన్ రెడ్డి
ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చౌటకూరి చేతన్ రెడ్డి టెక్నాలజీ ప్రొఫెషనల్‌గా సేవలందిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలపై దృష్టి సారిస్తున్న ఆయన.. భాగస్వామ్యాలు, పెట్టుబడులు, స్థిరమైన కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
బాధ్యతలు: జార్జియా, మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా.
నెట్‌వర్కింగ్ నుంచి కొత్త అవకాశాల వరకు..
AAA–ABC రీజినల్ డైరెక్టర్ల బాధ్యతలు కేవలం సంస్థ కార్యక్రమాల నిర్వహణకే పరిమితం కాకుండా.. వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, యువ నాయకులను అనుసంధానం చేయడం ప్రధాన లక్ష్యంగా ఉండనుంది.
స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో కలిసి పనిచేస్తూ కొత్త వ్యాపార భాగస్వామ్యాలకు అవకాశాలు కల్పించడం, మెంటరింగ్ కార్యక్రమాలను ప్రోత్సహించడం, యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ను మరింత విస్తరించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
25 రాష్ట్రాల్లో విస్తరించనున్న ప్రాంతీయ నాయకత్వం
ఐదుగురు రీజినల్ డైరెక్టర్లకు ఐదు చొప్పున రాష్ట్రాల బాధ్యతలు అప్పగించడంతో మొత్తం 25 రాష్ట్రాల్లో AAA–ABC ప్రాంతీయ నెట్‌వర్క్‌కు కొత్త ఊపు రానుంది. స్థానిక స్థాయిలో ఉన్న ప్రతిభ, వ్యాపార అవకాశాలు, పెట్టుబడి అవకాశాలు, ప్రొఫెషనల్ నెట్‌వర్క్‌లను ఒకదానితో ఒకటి అనుసంధానం చేయడం ద్వారా మరింత బలమైన కమ్యూనిటీ ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
2028–2031.. కొత్త దిశలో AAA–ABC
2028 జనవరి 1 నుంచి 2031 డిసెంబర్ 31 వరకు కొత్త రీజినల్ డైరెక్టర్ల పదవీకాలం కొనసాగనుంది. వారి నాయకత్వంలో అమెరికాలోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపార, వృత్తి, కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయడంతో పాటు.. కొత్త భాగస్వామ్యాలు, కొత్త నాయకత్వం, కొత్త వ్యాపార అవకాశాలకు వేదికగా AAA–ABC నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాలన్నది సంస్థల లక్ష్యంగా ఉంది.
కొత్తగా ఎంపికైన రీజినల్ డైరెక్టర్లకు AAA గవర్నింగ్ బోర్డు అభినందనలు తెలిపింది. వారి అనుభవం, నాయకత్వ సామర్థ్యాలతో రాబోయే సంవత్సరాల్లో కమ్యూనిటీకి మరింత ప్రయోజనకరమైన కార్యక్రమాలు, సేవలు అందుబాటులోకి వస్తాయని ఆకాంక్షించింది.














