అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్‌ను విజయవంతంగా నిర్వహించడంలో నాయకత్వంతో పాటు వాలంటీర్లు, స్పాన్సర్లు, దాతలు కీలక పాత్ర పోషించారు. మహాసభల విజయానికి వ్యాపారవేత్తలు, కమ్యూనిటీ సభ్యులు, శ్రేయోభిలాషులు అందించిన సహకారం ఎంతో దోహదపడింది.

ఈ క్రమంలో గ్రీన్‌రిచ్ గ్రూప్ – ఆరుణ్య విల్లాస్ మహాసభల నిర్వహణకు విశేష సహకారం అందించింది. సంస్థ అందించిన విలువైన సహకారాన్ని గుర్తించిన ATA నాయకత్వం మహాసభల వేదికపై గ్రీన్‌రిచ్ గ్రూప్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ తీగల నర్సిరెడ్డి, ఆరుణ్య విల్లాస్‌కు చెందిన అచ్చిరెడ్డి, రంజిత్లను ఘనంగా సన్మానించింది. కమ్యూనిటీ కార్యక్రమాలు, తెలుగు సంస్కృతి పరిరక్షణకు అందిస్తున్న సహకారానికి గుర్తింపుగా ఈ సన్మానం జరిగింది.

ఆరుణ్య విల్లాస్ ఆధునిక జీవనశైలికి, ప్రకృతికి సమన్వయాన్ని అందించే ప్రత్యేకమైన విల్లా కమ్యూనిటీగా రూపుదిద్దుకుంటోంది. పచ్చదనం, విశాలమైన ఓపెన్ స్పేస్‌లు, సహజ కాంతి, ప్రకృతితో అనుసంధానం ప్రధాన లక్షణాలుగా రూపొందించిన ఈ బియోఫిలిక్ కమ్యూనిటీలో ప్రతి విల్లా ప్రత్యేకమైన ఆర్కిటెక్చర్‌తో తీర్చిదిద్దబడింది.

Aira, Arna, Aura పేర్లతో మూడు విభిన్న విల్లా టైపాలజీలు ఉండగా.. ప్రతి డిజైన్‌కు ప్రత్యేకమైన నిర్మాణ శైలి ఉన్నప్పటికీ, విశాలత, సొగసు, సమకాలీన జీవన విధానం అనే ఉమ్మడి ఆలోచనను ప్రతిబింబిస్తాయి.

హైదరాబాద్‌లోని తుక్కుగూడలో 500 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్న గ్రీన్‌రిచ్ హైలాండ్స్ సమగ్ర టౌన్‌షిప్‌లో ఆరుణ్య విల్లాస్‌ను అభివృద్ధి చేస్తున్నారు. విశాలమైన ల్యాండ్‌స్కేప్స్, మెరుగైన కనెక్టివిటీ, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాలతో పాటు.. ప్రత్యేకమైన ప్రైవేట్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ అనుభూతిని అందించేలా ప్రాజెక్టును రూపొందిస్తున్నారు.

ATA మహాసభల సందర్భంగా గ్రీన్‌రిచ్ గ్రూప్ – ఆరుణ్య విల్లాస్‌కు అందించిన గౌరవం వ్యాపార రంగం, తెలుగు కమ్యూనిటీ మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. ఇలాంటి సంస్థలు, దాతలు అందించే సహకారం తెలుగు సమాజానికి సంబంధించిన సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలను మరింత విజయవంతంగా నిర్వహించేందుకు కీలకంగా ఉంటుందని ATA నాయకత్వం పేర్కొంది.

తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తూ.. వ్యాపార విజయంతో పాటు కమ్యూనిటీ అభివృద్ధిలోనూ భాగస్వాములవుతున్న గ్రీన్‌రిచ్ గ్రూప్ – ఆరుణ్య విల్లాస్‌కు ATA మహాసభల వేదికపై లభించిన ఈ సన్మానం ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది.